Nasir Hossain: రెండేళ్ల వనవాసం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్! ఇంతం ఏంచేసి బ్యాన్ అయ్యాడో తెలుసా?
బంగ్లాదేశ్ ఆటగాడు నాసిర్ హుస్సేన్ రెండు సంవత్సరాల నిషేధం తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2020లో ఫిక్సింగ్ ఆరోపణలపై ICC నిషేధం విధించగా, ఇప్పుడు ఆయన అన్ని ప్రమాణాలను పూర్తి చేసి తిరిగి అర్హత పొందాడు. ఏప్రిల్ 7న ఆయన ఢాకా లీగ్‌లో మ్యాచ్ ఆడి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ పునరాగమనంతో మళ్లీ బంగ్లా జట్టులో స్థానం దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది.

బంగ్లాదేశ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ నాసిర్ హుస్సేన్ రెండు సంవత్సరాల నిషేధం అనంతరం మళ్లీ క్రికెట్ ప్రపంచానికి అడుగుపెట్టాడు. 2020-21లో జరిగిన అబుదాబి టీ20 లీగ్ సమయంలో ఫిక్సింగ్ జరిగినట్లు అతనిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విచారణ చేపట్టగా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. మొత్తం మూడు ఆరోపణలను స్వయంగా అంగీకరించిన నాసిర్ హుస్సేన్‌పై ICC రెండేళ్ల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నిషేధం విధించింది. అయితే, ఇందులో ఆరు నెలల నిషేధాన్ని సస్పెండ్ చేయగా, మిగిలిన నిషేధాన్ని అతను విజయవంతంగా పూర్తి చేశాడు. అన్ని ప్రమాణాలు పూర్తి చేసిన నాసిర్ ఇప్పుడు తిరిగి క్రికెట్ ఆడేందుకు అర్హత సాధించాడు.
నాసిర్ హుస్సేన్‌పై నిషేధం ఎత్తివేయడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 7, 2025 నుంచి నాసిర్ అధికారికంగా క్రికెట్ ఆడే అవకాశం కలుగుతుందని. అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం అవసరమైన విద్యా సెషన్లు పూర్తి చేసిన తరువాత అతను తిరిగి పోటీల్లో పాల్గొనడానికి అనుమతి పొందాడు. ఆ రోజే నాసిర్ హుస్సేన్, ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్‌లో రూప్‌గంజ్ టైగర్స్ క్రికెట్ క్లబ్, ఘాజీ గ్రూప్ జట్టుతో మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా అభిమానులు అతని పునరాగమనాన్ని స్వాగతించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కూడా బంగ్లాదేశ్‌కు ప్రాధాన్యతనిచ్చిన నాసిర్ హుస్సేన్ తన కెరీర్‌ను 2011లో ప్రారంభించాడు. 2011 నుంచి 2018 మధ్యకాలంలో 31 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఒక్క అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ నాసిర్ హుస్సేన్ తన ప్రతిభను చాటుకున్నాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 6,000 పూర్తి పరుగులు చేయడమే కాకుండా, మొత్తం 17 శతకాలు నమోదు చేశాడు. అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2018లో జరిగింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లలో పాల్గొంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు నిషేధం అనంతరం మళ్లీ పట్టుదలతో మైదానంలోకి అభిమానులకు సంతోషకర విషయం. భవిష్యత్తులో అతను మళ్లీ బంగ్లాదేశ్ జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడా? అన్నది ఆసక్తికర అంశంగా మారింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..