IPL 2025: ‘వారెవ్వా.. అదిరిపోయే ఆఫర్ అంటే ఇదే కదా.. రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు’

Basit Ali demands 50 crores to be paid for Rishabh Pant: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్లను విడుదల చేశాయి. ఇందులో చాలామంది స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్ తగిలింది. వీళ్లంతా రాబోయే వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

IPL 2025: 'వారెవ్వా.. అదిరిపోయే ఆఫర్ అంటే ఇదే కదా.. రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు'
Rishabh Pant
Follow us
Venkata Chari

|

Updated on: Nov 04, 2024 | 8:30 PM

Basit Ali demands 50 crores to be paid for Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. ముంబై వేదికగా జరిగిన సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ 147 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో వైట్‌వాష్ అయింది. స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది.

ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇదిలావుండగా, ఐపీఎల్ 2025 వేలంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు రూ.50 కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఇటీవల ఫ్రాంచైజీ అతన్ని మెగా వేలానికి ముందు విడుదల చేసింది.

పంత్ షాట్ ఎంపికతో ఫిదా అయిన బాసిత్ అలీ..

స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై మంచి ప్రదర్శన చేసిన అతికొద్ది మంది భారత బ్యాట్స్‌మెన్‌లలో పంత్ ఒకరు. రోహిత్ శర్మ – విరాట్ కోహ్లి లొంగిపోయిన పిచ్‌పై ముంబైలో తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. పంత్ ఆటతీరు పట్ల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఐపీఎల్ వేలంలో పంత్‌కు రూ.50 కోట్లు ఇవ్వడంపై మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. ఈ పిల్లవాడి గురించి నేను ఏమి చెప్పగలను? ఆయన విలువ రూ. 25 కోట్లు అని జనాలు అనవచ్చు. కానీ, ఆయనకు రూ. 50 కోట్లకు కొనాలి అని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చాడు.

పంత్ స్మార్ట్ షాట్-సెలక్షన్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుందని బాసిత్ చెప్పుకొచ్చాడు. పంత్ బలహీనంగా ఉన్నాడని తెలిసిన ప్రాంతాల్లో ప్రమాదకర షాట్‌లను నివారించడానికి ఇది అతనికి సహాయపడిందని తెలిపాడు. ‘అతను ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అది ఫ్లాట్ పిచ్‌లా అనిపించింది. అతను కోరుకున్న చోట షాట్లు కొట్టేవాడు. కానీ, షాట్ ఎంపికలో చాలా తెలివిగా ఉన్నాడు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో షాట్లు ఆడకూడదని అతనికి తెలుసు. దీన్ని చేయడంలో మిగిలిన ఆటగాళ్లు సఫలం కాలేదు. ముంబై టెస్టులో మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు విఫలమైనప్పటికీ, పంత్ భారత్‌కు చివరి ఆశాకిరణంగా మారాడు. కానీ, అతని ఔటయ్యాక, భారత్‌కు విజయంపై చివరి ఆశ కూడా చెదిరిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..