
Lalit Modi- Sushmitasen: ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఎందరో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ మెగా క్రికెట్ లీగ్‌కు ఆద్యుడెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆయనే లలిత్ మోడీ (Lalit Modi). ఐపీఎల్ సృష్టికర్తగా, ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆయనకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ (Sushmitasen)ను ఆయన పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. సుస్మితతో కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. ‘ మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా బెటర్ హాఫ్ (సుస్మిత)తో కొత్త జీవితం ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చంద్రునిపై తేలియాడుతున్నట్లు ఉంది ‘ అని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు మోడీ. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా ఐపీఎల్ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్.. ఆ తర్వాత పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాడు. దీంతో బీసీసీఐ అతనిని పదవి నుంచి సస్పెండ్ చేసింది. 2013 సంవత్సరంలో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని నిరూపితమైంది. దీంతో క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పాల్గొనకుండా BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది.
పెళ్లి చేసుకోలేదు.. జస్ట్ డేటింగ్ లో ఉన్నాం..
అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే మరో పోస్ట్ షేర్ చేశారు లలిత్ మోడి. ‘మేం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం. ఏదో ఒకరోజు తప్పకుండా పెళ్లికుండా చేసుకుంటాం’ అని అందులో క్లారిటీ ఇచ్చారు.
సుస్మితా సేన్ విషయానికొస్తే మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి సహజీవనమూ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ బంధం పెళ్లిపీటలెక్కకుండానే పెటాకులైంది. కొన్నాళ్ల తర్వాత.. సుస్మిత సేన్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. అయితే అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..