Video: ‘దేవుని దయతో’.. ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వినోద్ కాంబ్లీ..

Vinod Kambli Health Update: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ పరిస్థితి విషమంగా ఉందని వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అతని అభిమానులను ఆశ్చర్యపరిచాడు. వీడియోలో, 52 ఏళ్ల కాంబ్లీ సరిగ్గా నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన సంగతి తెలిసిందే.

Video: దేవుని దయతో.. ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వినోద్ కాంబ్లీ..
Vinod Kambli Health Update

Updated on: Aug 10, 2024 | 4:45 PM

Vinod Kambli Health Update: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ పరిస్థితి విషమంగా ఉందని వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అతని అభిమానులను ఆశ్చర్యపరిచాడు. వీడియోలో, 52 ఏళ్ల కాంబ్లీ సరిగ్గా నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు. కాంబ్లీ ఇప్పుడు తన ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

కాంబ్లీ హెల్త్ అప్‌డేట్..

వినోద్ కాంబ్లీ ఆ సమయంలో చాలా ధీన స్థితిలో కనిపించాడు. నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఎంతో రచ్చ జరిగింది. అయితే, 117 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కాంబ్లీ తన ఆరోగ్యంపై తాజా సమాచారం అందించాడు. X (గతంలో ట్విటర్)లో పోస్ట్ చేసిన వీడియోలో కాంబ్లీ ‘థంబ్స్ అప్’ చూపిస్తూ.. అతను పూర్తిగా బాగున్నానంటూ చెప్పుకొచ్చాడు.

దేవుని దయతో నేను ఆరోగ్యంగా ఉన్నాను..

ఈ క్రమంలో ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. ‘దేవుని దయతో నేను ఆరోగ్యంగా, జీవించి ఉన్నాను. ఫీల్డ్‌కి వెళ్లి బ్యాటింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నానంటూ రాసుకొచ్చాడు.

వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడనే విషయం తెలిసిందే. కాంబ్లీ భారతదేశం కోసం 100 కంటే ఎక్కువ వన్డేలు, 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ప్రతిభావంతులైన ఎడమచేతి వాటం ఆటగాడు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో దాదాపు 10,000 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 262గా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us