Cricket: బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి.. కారణమేంటంటే..

Bangladesh Cricket :బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా మంగళవారం (ఏప్రిల్‌19) ఇద్దరు మాజీ ఆటగాళ్లు కన్నుమూశారు

Cricket: బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి.. కారణమేంటంటే..
Bangladesh Cricketers

Edited By:

Updated on: Apr 20, 2022 | 9:56 AM

Bangladesh Cricket :బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా మంగళవారం (ఏప్రిల్‌19) ఇద్దరు మాజీ ఆటగాళ్లు కన్నుమూశారు. బంగ్లాదేశ్‌ తొలి అంతర్జాతీయ వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రహ్మాన్ (Samiur Rahman) (69) బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా ఢాకాలోని సిటీ ఆస్పత్రిలో మరణించారు. కాగా ఇదే వ్యాధితో చికిత్స పొందుతున్న మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ముషారఫ్ హుస్సన్‌ రుబేల్‌ (Mosharraf Hossain Rubel) (40) కూడా తుదిశ్వాస విడిచాడు. ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూయడం పట్ల బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (Bangladesh Cricket Board) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

సమియుర్ రహ్మన్.. బంగ్లాదేశ్ తరఫున రెండు మ్యాచులాడాడు.  జాతీయ జట్టుతో పాటు ఢాకా ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ బిమన్ వంటి స్థానిక జట్లకు కూడా రహ్మాన్‌ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కొన్నేళ్లపాటు అంపైర్ గా కూడా సేవలందించాడు. ఇక ముషరాఫ్ హుస్సేన్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున2008-16 మధ్య కాలంలో 5 వన్డేలు ఆడాడు. మొత్తం 4 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లోనూ సత్తాచాటాడు. మొత్తం 572 వికెట్లు పడగొట్టి స్టార్ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా వీరిద్దరి మరణానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు ఆటగాళ్లు కూడా నివాళులు అర్పించారు. దేశ వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ మ్యాచ్ లకు ముందు వీరు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Also Read: Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్‌ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!

వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..