Mukesh Kumar: బంగ్లాతో వద్దన్నారు.. దేశవాళీకి పొమ్మన్నారు.. కట్‌చేస్తే.. 5 వికెట్లతో షాకిచ్చిన టీమిండియా బౌలర్

ఇరానీ కప్ 2024-25 మ్యాచ్లో యంగ్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటికి సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇరానీ కప్ మ్యాచ్ లక్కోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. 3వ రోజు బౌలర్ ముఖేష్ కుమార్ ఫైవ్ వికెట్ హాల్ తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇరానీ కప్‌లో ముఖేష్ కుమార్‌కు ఇది ఫస్ట్ ఐదు వికెట్ల హాల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికిది 8వ వికెట్ కావడం విశేషం. ముఖేష్ కుమార్‌ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.

Mukesh Kumar: బంగ్లాతో వద్దన్నారు.. దేశవాళీకి పొమ్మన్నారు.. కట్‌చేస్తే.. 5 వికెట్లతో షాకిచ్చిన టీమిండియా బౌలర్
Mukesh Kumar Five Wicker Ha
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 03, 2024 | 12:04 PM

Mukesh Kumar: ఇరానీ కప్ 2024-25 మ్యాచ్‌లో యంగ్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటికి సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇరానీ కప్ మ్యాచ్ లక్కోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. 3వ రోజు బౌలర్ ముఖేష్ కుమార్ ఫైవ్ వికెట్ హాల్ తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇరానీ కప్‌లో ముఖేష్ కుమార్‌కు ఇది ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికిది 8వ వికెట్ కావడం విశేషం. ముఖేష్ కుమార్‌ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.

కాగా ముంబై తరుపున సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ, శ్రేయాస్ అయ్యార్, రహానే హాఫ్ సెంచరీ చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 537 స్కోర్‌ను లక్ష్యంగా రెస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ముంబై కెప్టెన్‌గా రహానే, రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన రుతురాజ్ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన ముంబైయి మ్యాచ్‌కు మంచి స్టార్ట్ ఇవ్వలేదనే చెప్పాలి, ఓపెనింగ్ వచ్చిన ఆయుష్ 19 పరుగులు, పృథ్వీ షా 4  పరుగులు మాత్రమే చేసి ఔటైయ్యారు. ఆ తర్వాత వచ్చిన హార్ధిక్ తమోర్ ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. అనంతరం రహానే, శ్రేయాస్ అయ్యర్‌లు అడ్డుగా నిలబడి హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ జట్టకు అండగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసి జట్టును కష్టాలోంచి తప్పించాడు.

వీడియో:

ముంబై ప్లేయింగ్ 11: పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుష్ కొట్యాన్, మోహిత్ అవస్థి, ఎం జునైద్ ఖాన్.

రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లేయింగ్ 11: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, యశ్ దయాల్, పర్షిద్ కృష్ణ, ముఖేష్ కుమార్.