Andhra Pradesh: ఎంపీ కేశినేని చిన్నికి కీలక టాస్క్.. మొట్ట మొదటిసారిగా..!

| Edited By: Balaraju Goud

Aug 18, 2024 | 12:34 PM

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ACA పగ్గాలు కొత్త పాలక వర్గం చేతుల్లోకి వెళ్లింది. నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఎన్నికకాగా... తుది ఫలితాలు సెప్టెంబర్‌ 8న అధికారికంగా ప్రకటించనున్నారు.

Andhra Pradesh: ఎంపీ కేశినేని చిన్నికి కీలక టాస్క్.. మొట్ట మొదటిసారిగా..!
Kesineni Sivanath
Follow us on

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ACA పగ్గాలు కొత్త పాలక వర్గం చేతుల్లోకి వెళ్లింది. నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఎన్నికకాగా… తుది ఫలితాలు సెప్టెంబర్‌ 8న అధికారికంగా ప్రకటించనున్నారు.

క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదనే మాట చెప్పుకోవడానికే బాగుంటుంది. మామూలు రాజకీయాల కంటే క్రీడల్లోనే పవర్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. క్రికెట్లో అయితే పవర్ ప్లేకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో రాజకీయ జోక్యానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు గత కొన్ని ఏళ్లుగా ఇలా జరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా క్రీడల్లో రాజకీయ జోక్యం గడచిన దశాబ్ద కాలంగా ఎక్కువైంది. ప్రభుత్వం మారిన ప్రతీసారి అధికారపార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకి అత్యంత సన్నిహితంగా ఉండే నేత చేతుల్లోకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెలుతోంది.

గత ప్రభుత్వంలో విజయ్ సాయి రెడ్డికి సమీప బంధువైన అరబిందో శరత్ చంద్రారెడ్డి చైర్మన్ గా, ఆయన సోదరుడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా.. ఎస్సార్ గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా ఉన్న ప్యానల్ ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ వ్యవహారాలని చూసింది. ప్రభుత్వం మారడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై పెత్తనం కూడా మారింది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సానా సతీష్, సంయుక్త కార్యదర్శిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే నెల 8న వీరి ఎన్నిక లాంఛనం కాబోతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే .. గతంలో వివాదాలపాలైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై దృష్టిపెట్టింది. ప్రభుత్వ పెద్దలు ACAను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కేశినేని చిన్నికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎంపీ చిన్ని నేరుగా విశాఖ వెళ్లి ఇప్పటివరకు పెత్తనం చేసిన పాలకవర్గానికి ప్రభుత్వ ఆలోచనను తెలియజేశారు. కొంత సమయం తీసుకున్న శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలోని పాలకవర్గం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆగస్ట్ 4న రాజీనామా సమర్పించింది. తర్వాత ప్రత్యేక సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త కమిటీ ఎన్నికకు నిర్ణయం తీసుకుంది.

ACA ప్రెసిడెంట్ స్థానానికి కేశినేని శివనాథ్‌ తరపున కర్నూలు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవిందరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అదేవిధంగా పి.వెంకట ప్రశాంత్ వైస్‌ ప్రెసిడెంట్‌ గా, సానా సతీష్‌ బాబు సెక్రెటరీ గా, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు జాయింట్‌ సెక్రెటరీ గా, దండమూడి శ్రీనివాస్‌ -ట్రెజరర్‌ గా, డి.గౌరు విష్ణు తేజ్‌ – కౌన్సిలర్‌ గా నామినేషన్లు వేశారు. నామినేషన్ ల గడువు ముగిసే సమయానికి ఒకటే ప్యానల్ నామినేషన్ వేయడం, నామినేషన్ గడువు పూర్తి కావడంతో కేశినేని చిన్ని ప్యానల్ ఏకగ్రీవం గా ఎన్నికైంది. తుది ఫలితాలను వచ్చేనెల 8న అధికారిక ప్రకటించనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..