AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చేసింది తొక్కలో 55 రన్స్.. ఎందుకీ ఎక్స్‌ట్రాలు? పాక్ ప్లేయర్ల ఛప్రీ చేష్టలు

భారత్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. షఫాలీ వర్మను అవుట్ చేసిన తర్వాత ఆమె చేసిన సైగలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మ్యాచ్‌లో పాక్ 55 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Video: చేసింది తొక్కలో 55 రన్స్.. ఎందుకీ ఎక్స్‌ట్రాలు? పాక్ ప్లేయర్ల ఛప్రీ చేష్టలు
Sana Fatima Vs Shafali Varm
SN Pasha
|

Updated on: Sep 06, 2026 | 10:06 AM

Share

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే, నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగే భారత అమ్మాయిలు పాకిస్థాన్ జట్టును చిత్తుగా చిత్తుగా ఓడించి వార్ వన్ సైడ్ చేసేశారు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా వ్యవహరించిన తీరు ఆమెనే కాదు మొత్తం పాకిస్థాన్‌నే నవ్వుల పాలయ్యేలా చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను 12 పరుగుల వద్ద అవుట్ చేసిన అనంతరం, ఆమె పెవిలియన్ వైపు వెళ్లే సమయంలో షఫాలీని ఉద్దేశించి సైగలు చేసింది. దీంతో ఫాతిమా తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీమ్ మొత్తం కలిపి చేసిందే 55 పరుగులు దానికే ఎందుకింత ఓవర్ యాక్షన్ అంటూ ఏకంగా కామేంటేటర్లు సైతం విమర్శలు గుప్పించారు.

3,000 టీ20 పరుగులతో షఫాలీ చరిత్ర

ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన షఫాలీ.. ఆ తర్వాత సింగిల్ తీసుకుని ఈ మైలురాయిని అందుకుంది. 22 ఏళ్ల 220 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించింది.

పాక్ 55 పరుగులకే ఆలౌట్

షఫాలీ వికెట్ తీసిన ఫాతిమా సనా మూడు వికెట్లతో పాకిస్థాన్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. షఫాలీతో పాటు ప్రతీకా రావల్, స్మృతి మంధాన వికెట్లను కూడా ఆమెనే పడగొట్టింది. అయితే పాకిస్థాన్ బ్యాటింగ్ మాత్రం ఘోరంగా విఫలమైంది. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులతో ఉన్న పాక్ జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ జట్టు చివరి 10 వికెట్లను కేవలం 28 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం ఆ జట్టు పతనాన్ని స్పష్టంగా చూపించింది. భారత స్పిన్నర్లు శ్రీ చరణీ, ప్రేమా రావత్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. దీంతో పాకిస్థాన్ మహిళల టీ20ల్లో అత్యల్ప స్కోర్లలో ఒకటిగా 55 పరుగులకే పరిమితమైంది.

68 బంతులు మిగిలుండగానే భారత్ విజయం

55 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ సులభంగా ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ నాటౌట్‌గా నిలిచి జట్టును 8.4 ఓవర్లలో 57 పరుగులకు చేర్చారు. హర్మన్‌ప్రీత్ 18, దీప్తి శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 68 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఫాతిమా తీరుపై విమర్శలు

మ్యాచ్ అనంతరం ఫాతిమా సనా షఫాలీని అవుట్ చేసిన తర్వాత చేసిన సైగలపై వ్యాఖ్యాత వివేక్ రజ్దాన్ విమర్శలు చేశారు. ‘‘మీ జట్టు మొత్తం 55 పరుగులకే ఆలౌట్ అయింది.. ఇప్పుడు షఫాలీ వర్మను వెనక్కి పంపిస్తున్నారు’’ అంటూ ఆమె తీరును ప్రశ్నించారు. భారత్ ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించి గ్రూప్ దశను అజేయంగా ముగించింది. మరోవైపు పాకిస్థాన్ సెమీఫైనల్ బెర్త్ కోసం హాంకాంగ్‌తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌పై ఆధారపడాల్సి ఉంది.

Follow Us