AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏంది.. RCB vs CSK మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందా.. అంపైర్లు ఇలా తయారయ్యారేంది భయ్యా

Fans Reactions on Umpires: ఐపీఎల్ (IPL) 2025లో అంపైర్ల నిర్ణయాలపై నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని నిర్ణయాలు సరైనవి కాగా, కొన్ని నిర్ణయాలు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ ఓ విచిత్రమైన నిర్ణయాన్నే ఇచ్చాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Video: ఏంది.. RCB vs CSK మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందా.. అంపైర్లు ఇలా తయారయ్యారేంది భయ్యా
Dewlad Brevis Lbw Decision
Venkata Chari
|

Updated on: May 04, 2025 | 8:54 AM

Share

Fans Reactions on Umpires: ఐపీఎల్ (IPL) 2025లో అంపైర్ల నిర్ణయాలపై నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని నిర్ణయాలు సరైనవి కాగా, కొన్ని నిర్ణయాలు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ ఓ విచిత్రమైన నిర్ణయాన్నే ఇచ్చాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డెవాల్డ్ బ్రెవిస్‌ను అంపైర్ తప్పుగా ఎల్బీ ఔట్ చేశాడు. ఆ తరువాత అతను DRS కోసం అప్పీల్ చేశాడు. అప్పటికే సమయం ముగిసినందున దానిని తిరస్కరించారు.

ఈ సంఘటన చెన్నై ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జరిగింది. లుంగీ న్గిడి బౌలింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లోని మూడో బంతికి అతను ఫుల్ టాస్ వేశాడు. అది నేరుగా వెళ్లి డెవాల్డ్ బ్రెవిస్ ప్యాడ్‌కు తగిలింది. ఆ తర్వాత బలమైన అప్పీల్ రావడంతో, అంపైర్ నితిన్ మీనన్ బ్రెవిస్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయం తీసుకునే సమయంలో బ్రెవిస్, జడేజా పరుగును పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత బ్రెవిస్ జడేజాతో చర్చించి DRS తీసుకోవాలని సిగ్నల్ ఇచ్చాడు. కానీ, అంపైర్ DRS తీసుకోవడానికి సమయం అంటే 15 సెకన్లు దాటిపోయిందని తెలిపాడు. కానీ ఈ సమయంలో, అభిమానులు, వ్యాఖ్యాతలు టైమర్ తెరపై చూపించకపోవడంతో ఆశ్చర్యపరిచారు.

ఇవి కూడా చదవండి

బ్రెవిస్ DRS నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బంతి వికెట్లను తాకకపోవడంతో అతను నాటౌట్‌గా ప్రకటించబడేవాడని రీప్లేలు చూపించాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై చివరి బంతికి 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్రెవిస్ నాటౌట్‌గా ఉండి ఉంటే, CSK మ్యాచ్ గెలిచి ఉండేది. ఇప్పుడు అభిమానులు ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో అంపైర్లను ట్రోల్ చేస్తున్నారు.

డెవాల్డ్ బ్రెవిస్ ఎల్బీ నిర్ణయంపై స్పందనలు..

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..