Virat Kohli: సచిన్ రికార్డ్‌ను కాపాడేందుకే కోహ్లీకి విశ్రాంతి.. బీసీసీఐలో ముంబై వాళ్ల పెత్తనం ఏందంటూ ఫ్యాన్స్ ఫైరింగ్..

|

Sep 19, 2023 | 5:41 PM

Sachin Tendulkar vs Virat Kohli: ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో 47వ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును నమోదు చేసేందుకు విరాట్ కోహ్లీకి కేవలం 3 సెంచరీలు చేయాల్సి ఉంటుంది. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Virat Kohli: సచిన్ రికార్డ్‌ను కాపాడేందుకే కోహ్లీకి విశ్రాంతి.. బీసీసీఐలో ముంబై వాళ్ల పెత్తనం ఏందంటూ ఫ్యాన్స్ ఫైరింగ్..
Sachin Vs Kohli
Follow us on

Sachin Tendulkar vs Virat Kohli: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. అయితే, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ కనిపించడు. మొహాలీ, ఇండోర్‌లలో జరగనున్న 2 మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అయితే ఈ ప్రకటన తర్వాత కోహ్లీ అభిమానులు బీసీసీఐ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే, కింగ్ కోహ్లి ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీ రికార్డును బద్దలు కొట్టే దశలో ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీకి నిరంతరం విశ్రాంతి ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతనికి విశ్రాంతి లభించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లకు అతనికి విశ్రాంతి లభించింది.

విరాట్ కోహ్లి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి ఎందుకు నిరంతరం విశ్రాంతి ఇస్తున్నారనే ప్రశ్నలను అభిమానులు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో కోహ్లీ 5 సెంచరీలు సాధించాడు. అన్ని మ్యాచ్‌లు ఆడి ఉంటే ఇప్పటికే సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసి ఉండేవాడు. ఈ రికార్డును కాపాడుకునేందుకే కోహ్లీకి విశ్రాంతి ఇస్తున్నారని అభిమానులు వాదిస్తున్నారు.

మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ముంబై లాబీయింగ్ అంటూ ఆరోపిస్తున్నారు. సచిన్ రికార్డులను కాపాడేందుకు ముంబైకి చెందిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు.

అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో 47వ సెంచరీని నమోదు చేశాడు.

ఇప్పుడు వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీ రికార్డును నమోదు చేసేందుకు విరాట్ కోహ్లీకి కేవలం 3 సెంచరీలు మాత్రమే కావాలి. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ వన్డే ప్రపంచకప్ ద్వారా కింగ్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమన్నాడు. ఎందుకంటే ప్రపంచకప్‌లో టీమిండియా తొలి రౌండ్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ బ్యాట్‌తో 3 సెంచరీలు సాధిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లకు ఎంపికైన టీమిండియా:

ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, పర్ద్‌ష్ కృష్ణ వర్మ, , రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.

ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ (ఫిట్ అయితే).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..