Virat Kohli: సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చిని అభిమాని.. నేరుగా కోహ్లీ దగ్గరకు వెళ్లి.. వీడియో

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సుమారు 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. దీంతో అతనిని చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. స్టేడియం బయట సుమారు 2 కిలోమీటర్ల పొడవాటి క్యూలో నిలబడి మరీ ఎదురుచూస్తున్నారు. అయితే విరాట్‌ను కలిసేందుకు ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు.

Virat Kohli: సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చిని అభిమాని.. నేరుగా కోహ్లీ దగ్గరకు వెళ్లి.. వీడియో
Virat Kohli

Updated on: Jan 30, 2025 | 12:16 PM

 

విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నాడు. అందులోనూ తన సొంత గడ్డ అయిన ఢిల్లీలో మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో కోహ్లీని చూసేందుకు క్రికెట్ అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో ఒక అభిమాని స్టేడియంలోని భద్రతా వలయాన్ని ఛేదించుకుని విరాట్ కోహ్లీని కలిశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్‌తో సహా ఢిల్లీ జట్టు మొత్తం మైదానంలోకి అడుగు పెట్టింది. రైల్వేస్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ జరుగుతుండగా, విరాట్ కోహ్లీని కలవడానికి ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి పరుగు పరుగున వచ్చి విరాట్ కోహ్లీ పాదాలకు నమస్కరించాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అభిమానిని పట్టుకుని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ ఘటనలో విరాట్ కోహ్లీ కూడా తన మంచి మనసును చాటుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది క్రికెట్ అభిమానిని తీసుకెళ్తున్నప్పుడు కాస్త కఠినంగా వ్యవహరించారు. ఇది గమనించిన విరాట్ కోహ్లీ అతనిని కొట్టవద్దని, తిట్టవద్దని అభ్యర్థించాడు. రైల్వేస్ జట్టు 11.1 ఓవర్లలో 3 వికెట్లకు 33 పరుగుల వద్ద ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికంటే ముందు స్టేడియంలోకి భారీగా ప్రేక్షకులు రావడం కనిపించింది. విరాట్ కోహ్లీని చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా అభిమానులు క్యూ కట్టారు.

వీడియో ఇదిగో..

అతనిని ఏం చేయద్దు..

స్టేడియం బయట కోహ్లీ అభిమానుల హంగామా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..