RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 2011లో తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి.. తొలి 108 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. 28 టెస్టుల్లో, 60 వన్డేలు, 20 టీ20లతో కలిపి ఈ ఘనత సాధించాడు. 2014 డిసెంబర్‌లో 109వ ఇన్నింగ్స్‌లో..

RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..
Rcb Ipl 2026

Updated on: Jan 07, 2026 | 9:31 AM

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పాడు. 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుప్లెసిస్.. తన కెరీర్‌లో ఆడిన మొదటి 108 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాలేదు. ఇది క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని అరుదైన ఘనతగా చరిత్రలో ఉంది. అవుట్ కాకుండా ముందు వరకు డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌లో 28 ఇన్నింగ్స్‌లు, వన్డేల్లో 60 ఇన్నింగ్స్‌లు, టీ20ల్లో 20 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

ఇలా మొత్తం 108 ఇన్నింగ్స్‌లలో డకౌట్ అవ్వకుండా నిలకడగా రాణించాడు. సుదీర్ఘకాలం పాటు డకౌట్ కాకుండా కొనసాగిన ఈ రికార్డు 2014 డిసెంబర్‌లో ముగిసింది. తన 109వ అంతర్జాతీయ ఇన్నింగ్స్‌‌లో డుప్లెసిస్ మొదటిసారి డకౌట్ అయ్యాడు. ప్రపంచ క్రికెట్‌లో తన డెబ్యూ చేసినప్పటి నుంచి 100కు పైగా అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు డక్ కాకుండా ఆడిన ఏకైక బ్యాటర్‌గా డుప్లెసిస్ చరిత్రకెక్కాడు. కాగా, చెన్నై నుంచి బయటకు వచ్చిన డుప్లెసిస్.. ఆ తర్వాత 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ  రెండేళ్లలో బెంగళూరు జట్టుకు కీలక సభ్యుడిగా మారడమే కాదు.. కెప్టెన్‌గా వ్యవహరించి విజయపధంలో నడిపాడు. కానీ ఆ తర్వాత 2025 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరాడు. ఇక ఈ మినీ వేలంలో ఎవ్వరూ డుప్లెసిస్‌ను దక్కించుకోకపోగా.. రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి