Ind vs Eng 3rd Test : లార్డ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరీస్‌లో ఆధిక్యం కోసం పోరాటం
లార్డ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఇంగ్లాండ్ వ్యూహంలో భాగం. పిచ్ ప్రారంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి, భారత బౌలర్లు ఎంత త్వరగా వికెట్లు తీస్తారనేది కీలకం. బుమ్రా రాకతో భారత బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఎవరు ఆధిక్యం సాధిస్తారో చూడాలి.

Ind vs Eng 3rd Test : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానుల నిరీక్షణ ముగిసింది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఈ పోరు షురూ అయింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది కాబట్టి, ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని చూస్తున్నాయి. మొదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే, రెండో టెస్ట్‌లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. లార్డ్స్‌లో భారత్ హిస్టరీ చూస్తే, ఆతిథ్య జట్టు కంటే కొంచెం మెరుగ్గా ఉంది. భారత్ ఈ మైదానంలో 1986, 2014, 2021లో మూడు టెస్ట్ విజయాలు నమోదు చేసింది. ఇంగ్లాండ్‌లోని ఏ ఇతర మైదానం కంటే లార్డ్స్‌లోనే భారత్‌కు ఎక్కువ విజయాలు ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ అద్భుతమైన విజయం తర్వాత ఆకాష్ దీప్ బౌలింగ్ విభాగంలో బాగా రాణిస్తున్నారు. అలాగే, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ కూడా ప్రశంసలు అందుకుంది. లార్డ్స్ టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం భారత జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయబోతున్నాం. ఇక్కడ పిచ్ మొదట్లో బౌలర్లకు సాయం చేస్తుంది. ఇది హోరాహోరీ సిరీస్. ప్రస్తుతం మా టీం రెడీగా ఉంది. ప్రతి క్రికెటర్ లార్డ్స్‌లో ఆడటాన్ని ఎంతో ఇష్టపడతారు. మా జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. ఆర్చర్ తిరిగి వచ్చారని తెలిపారు.
అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఈ ఉదయం వరకు ఏం చేయాలో నాకు తెలియలేదు. నేను మొదట బౌలింగ్ చేయాలనుకున్నాను. మొదటి సెషన్‌లో బౌలర్లకు కొంత హెల్ప్ అవుతుంది. అందరూ తమ వంతు కృషి చేశారు. అదే చర్చ జరిగింది. బౌలర్లు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మా జట్టులో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా ఎంట్రీ ఇచ్చారని తెలిపారు.
భారత జట్టు : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయెబ్ బషీర్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




