టీ20 బ్లాస్ట్ ఒక బౌలర్ చేసిన వినాశనాన్ని చవిచూసింది. అతని చరిత్ర ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు (England Test Team)తో ఏమాత్రం సంబంధం లేదు. కేవలం 4 ఓవర్లలోనే ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆబౌలర్.. 5 బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చి, ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ తీశాడు. టీ 20 బ్లాస్ట్(T20 Blast)లో విధ్వంసం సృష్టించిన బౌలర్.. టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు సవాలు విసిరేందుకు ఇంగ్లండ్ తయారు చేస్తోందని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ బౌలర్‌ను ఇంగ్లండ్ టీం నెట్ బౌలర్‌గా ఎంచుకుంది. ఆ బౌలర్ ఎవరంటే జేక్ లింటోట్ (Jake Lintott). లీసెస్టర్‌షైర్ వర్సెస్ బర్మింగ్‌హామ్ బేర్స్ మ్యాచ్‌లో లింటోట్ బంతితో విధ్వంసం సృష్టింంచి ప్రస్తుతం చర్చల్లో నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో, లింటోట్ బర్మింగ్‌హామ్ బేర్స్‌లో భాగంగా ఉన్నాడు. అతను తన స్విర్లింగ్ బంతులతో లీసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్‌లను చావు దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
4 ఓవర్లలో 27 పరుగులకే 4 వికెట్లు..
లీసెస్టర్‌షైర్‌లో పడిన 9 వికెట్లలో 4 వికెట్లను జేక్ లింటోట్ పడగొట్టాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఈ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లిన్నోట్ బౌలింగ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, అతను తన 4 వికెట్లలో 3 వికెట్లను ఒకే ఓవర్‌లో 5 బంతుల విరామంలో తీయడం. అయితే, అతను లీసెస్టర్‌షైర్ కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్‌లో తన వికెట్ల క్రమాన్ని ప్రారంభించాడు.
5 బంతుల్లో 3 వికెట్లు..
పవర్‌ప్లే ముగిసిన తర్వాత జేక్ లింటోట్ తన మొదటి వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2 పరుగులు మాత్రమే చేయగలిగిన లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కోలిన్ ఎక్మాన్‌ను అవుట్ చేశాడు. దీని తర్వాత, అతను లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌లో తన మిగిలిన 3 వికెట్లను తీశాడు. ఈ ఓవర్ తొలి బంతికే 51 బంతుల్లో 72 పరుగులతో ఆడుతున్న ఓపెనర్ స్కాట్ స్టీల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి నవీన్ ఉల్ హక్, 5వ బంతికి పార్కిన్‌సన్ అవుటయ్యాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.
When you have full confidence in your Captain… ?
?#YouBears | #BIRvLEI | @lintott23 pic.twitter.com/fDkPwYtvLX
— Bears ? (@WarwickshireCCC) June 2, 2022