ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కట్‌చేస్తే.. 12 ఫోర్లు, 5 సిక్సులు, 268 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కసిగా ఇచ్చిపడేశాడుగా..

The Hundred, Phil Salt: బౌలర్లను మరింతగా చితక్కొడుతూ జట్టును 100 పరుగులకు మించి తీసుకెళ్లాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకోలేక పోయాడు. 32 బంతుల్లో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ 86లో 78 పరుగులు కేవలం 12 ఫోర్లు, 5 సిక్సర్ల నుంచే వచ్చాయి. సాల్ట్ ఈ 'దాడి'ని మిగిలిన మాంచెస్టర్ బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోకయారు. దీంతో ఆ జట్టు 100 బంతుల్లో 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కట్‌చేస్తే.. 12 ఫోర్లు, 5 సిక్సులు, 268 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కసిగా ఇచ్చిపడేశాడుగా..
Phil Salt

Updated on: Aug 18, 2023 | 10:34 AM

ప్రపంచకప్‌నకు ఇంగ్లండ్ ఇప్పటికే తన జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నుంచి తిరిగి రావడంపై చాలా చర్చలు జరిగాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ ఈసారి కూడా పటిష్టమైన జట్టుగా కనిపిస్తోంది. అయితే, కొందరి ఆటగాళ్లకు ఈ లిస్టులో చోటు దక్కలేదు. అద్భుత ప్రదర్శన చేస్తున్నా.. ప్రపంచ కప్ జట్టులోకి రాలేకపోయారు. అలాంటి ఒక బ్యాట్స్‌మన్ బౌలర్లపై తన కోపాన్ని బయటపెట్టాడు. కసితో సిక్స్‌లు, ఫోర్లు కొట్టి చుక్కలు చూపించాడు. కేవలం 32 బంతుల్లో 86 పరుగులు చేయగా, బౌండరీలు లేకుండా కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయంటే ఔరా అనాల్సిందే. బ్యాట్‌తో ఇంత విధ్వంసం సృష్టించి ఆ ఇంగ్లండ్ ఆటగాడు ఎవరో కాదు ఫిల్ సాల్ట్.

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఫిల్ సాల్ట్ ఆగస్ట్ 17 గురువారం సాయంత్రం తన మార్క్ చూపించాడు. ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టును ఎంపిక చేసిన ఒక రోజు తర్వాత, సెలెక్టర్లపై కోపంతో కసిగా దంచి కొట్టాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. యాదృచ్ఛికంగా, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడిన సాల్ట్, అతని ఓపెనింగ్ పార్టనర్‌గా మాంచెస్టర్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో కలిసి ఇరగదీశాడు.

ఇవి కూడా చదవండి

కెప్టెన్ ముందు వేగవంతమైన బ్యాటింగ్..

నాటింగ్‌హామ్ ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మాంచెస్టర్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ తలపడగా, మాంచెస్టర్ మొదట బ్యాటింగ్ చేసింది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న సాల్ట్.. వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోగల సత్తా తనకుందని కెప్టెన్‌కి చూపించాడు. మొదటి బంతి నుంచే సాల్ట్ దాడి చేసి 5 బంతుల స్పెల్‌లో 4 ఫోర్లు బాదాడు. బట్లర్ ప్రారంభంలోనే ఔటైన తర్వాత కూడా, సాల్ట్ 20 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు.

కేవలం ఫోర్లు, సిక్సర్లతో 78 పరుగులు..


సాల్ట్ బౌలర్లను మరింతగా చితక్కొడుతూ జట్టును 100 పరుగులకు మించి తీసుకెళ్లాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకోలేక పోయాడు. 32 బంతుల్లో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ 86లో 78 పరుగులు కేవలం 12 ఫోర్లు, 5 సిక్సర్ల నుంచే వచ్చాయి. సాల్ట్ ఈ ‘దాడి’ని మిగిలిన మాంచెస్టర్ బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోకయారు. దీంతో ఆ జట్టు 100 బంతుల్లో 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..