
మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్ ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ సంధించిన ఓ డేంజరస్ బంతికి బద్దలవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాల్గవ టెస్టు మొదటి రోజు, భారత్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భారత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్ చేస్తుండగా, యశస్వి జైస్వాల్ బ్యాక్ ఫుట్ డిఫెన్సివ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. వోక్స్ వేసిన బంతి అదనపు బౌన్స్‌తో వచ్చి బ్యాట్‌కు బలంగా తగిలింది. దాని ప్రభావంతో బ్యాట్ హ్యాండిల్ పూర్తిగా విరిగిపోయి, బ్యాట్ రెండు ముక్కలైంది.
జైస్వాల్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. బంతిని డిఫెండ్ చేయబోతే బ్యాట్ విరిగిపోవడంతో అతడు కంగారు పడ్డాడు. వెంటనే డగౌట్ నుంచి కొత్త బ్యాట్ తెప్పించుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యం మైదానంలో ఉన్నవారినే కాదు, టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులను కూడా విస్మయానికి గురిచేసింది.
Well… that’s not supposed to happen 😅
The Woakes delivery cracks the handle of Jaiswal’s bat pic.twitter.com/OOgrdWU0BW— CBK (@CBKunchained) July 23, 2025
క్రిస్ వోక్స్ వేసిన ఈ బంతి కేవలం వేగంతో మాత్రమే కాకుండా, అదనపు బౌన్స్‌తో కూడా రావడంతోనే ఈ విధంగా జైస్వాల్ బ్యాట్ విరిగిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైస్వాల్ బ్యాట్‌ను బద్దలు కొట్టిన ఈ బంతి, వోక్స్ సంధించిన అత్యంత ప్రమాదకరమైన బంతుల్లో ఒకటిగా నిలిచింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. క్రిస్ వోక్స్ బౌలింగ్ పదునుకు, బంతి బౌన్స్‌కు నిదర్శనంగా ఈ సంఘటన నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు జైస్వాల్ బ్యాట్ నాణ్యతపై కూడా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా, ఈ సంఘటన మాంచెస్టర్ టెస్టు మొదటి రోజు హైలైట్‌గా నిలిచింది.