
India vs England 2nd ODI: రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్ తరపున బెన్ డకెట్ 65, జో రూట్ 69 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కెప్టెన్ జోస్ బట్లర్ 34, హ్యారీ బ్రూక్ 31, ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేశారు. భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
2ND ODI. WICKET! 49.5: Mark Wood 0(1) Run Out K L Rahul, England 304 all out https://t.co/NReW1eEQtF #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 9, 2025
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జిమ్మీ ఓవర్టన్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..