Video: 6, 6, 4, 6, 4.. దుబాయ్‌లో దుమ్మురేపిన ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్.. ఒకే ఓవర్లో రికార్డ్ రన్స్‌తో బీభత్సం

Jonny Bairstow: తన రోజు వచ్చినప్పుడు ఎలాంటి బౌలింగ్‌నైనా చిత్తు చేయడంలో నిపుణుడిగా మారిన ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్‌ను IPL 2025 మెగా వేలంలో కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజాగా ఐపిఎల్‌లో అమ్ముడుపోని వారంలో, ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అబుదాబి టీ -10 లీగ్‌లో అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఫ్రాంచైజీలు పశ్చత్తాపడేలా చేశాడు.

Video: 6, 6, 4, 6, 4.. దుబాయ్‌లో దుమ్మురేపిన ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్.. ఒకే ఓవర్లో రికార్డ్ రన్స్‌తో బీభత్సం
Jonny Bairstow Abu Dhabi T10 League
Follow us
Venkata Chari

|

Updated on: Nov 30, 2024 | 3:42 PM

Jonny Bairstow: యూఏఈలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోని సంగతి తెలిసిందే. ఇందులో జానీ బెయిర్‌స్టో కూడా ఉన్నాడు. ఇంగ్లండ్‌ జట్టులోని ఈ పవర్ ఫుల్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్‌ను ఏ జట్టు కూడా వేలం వేయలేదు. ఐపీఎల్ 2019, 2014లో సెంచరీలు చేసినప్పటికీ, ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. తాజాగా, వేలంలో అమ్ముడవ్వని ఈ ప్లేయర్.. ఫ్రాంచైజీలు ఎంత పెద్ద తప్పు చేశాయో నిరూపించాడు.

30 బంతుల్లో 70 పరుగుల తుఫాను ఇన్నింగ్స్..

అబుదాబి టీ-10 లీగ్‌లో, జానీ బెయిర్‌స్టో కేవలం 30 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో, అతను ఆఫ్ఘన్ స్పిన్నర్ షర్ఫుద్దీన్ అష్రాఫ్ వేసిన ఒక ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేశాడు. అద్భుతమైన పవర్ హిట్టింగ్‌ను ప్రదర్శిస్తూ, 35 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఆటగాడు మైదానంలోని ప్రతి మూలకు షాట్‌లు కొట్టాడు. అబుదాబి టీ10 లీగ్ 28వ మ్యాచ్‌లో అబుదాబి జట్టు మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సంప్ ఆర్మీ నిర్ణీత 10 ఓవర్లలో బోర్డ్‌పై 109 పరుగులు ఉంచింది. ఆతిథ్య అబుదాబి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, జానీ బెయిర్‌స్టో ఈ కీలక బాధ్యత వహించాడు.

ఒక్క ఓవర్‌లో 27 పరుగులు..

ప్రతికూల పరిస్థితుల్లో జానీ బెయిర్‌స్టో తన అంతర్గత శక్తిని మేల్కొల్పడంతో.. ఆరో ఓవర్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ షర్ఫుద్దీన్ అష్రఫ్‌కు చుక్కలు చూపించాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా బెయిర్‌స్టో రెండు సిక్సర్లు బాదాడు. తర్వాతి బంతికి థర్డ్ మ్యాన్ వైపు ఫోర్ కొట్టి, డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదాడు. ఓవర్‌ చివరి బంతిని ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్ స్క్వేర్ థర్డ్ మ్యాన్ వైపు మరో ఫోర్ బాదాడు. ఈ విధంగా ఓవర్‌లో మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. దీంతో 6 ఓవర్లలో స్కోరు 54/3గా మారింది. కానీ, 10 ఓవర్లలో జట్టు స్కోరు 106/4లుగా నిలిచింది. దీంతో విజయానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది. బెయిర్‌స్టో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో నిలదొక్కుకోగా, మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పరుగులు చేయలేకపోయారు.

ఐపీఎల్‌లో ప్రాథమిక ధర 2 కోట్లు..

జానీ బెయిర్‌స్టో 2019 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. టోర్నీలో 50 మ్యాచ్‌లు ఆడిన అతను రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలతో 1589 పరుగులు చేశాడు. 2019 నుంచి 2021 వరకు, అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భాగంగా ఉన్నాడు. అక్కడ అతని ఫీజు రూ. 2 కోట్ల 20 లక్షలు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ 207 శాతం పెరుగుదలతో 6 కోట్ల 75 లక్షల రూపాయల భారీ మొత్తానికి అతన్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అతను ఈ జట్టులో భాగమయ్యాడు. కానీ మెగా వేలానికి ముందు, పంజాబ్ అతనిని నిలుపుకోలేదు. దీంతో ఈ పవర్ హిట్టర్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్