చరిత్ర సృష్టించిన జో రూట్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు.. ఆ లిస్టులో అగ్రస్థానం.. సచిన్ ఎక్కడనున్నాడంటే?

|

Jun 06, 2022 | 11:26 AM

Most Runs in Test Cricket: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ లిస్టులో అతను 14వ బ్యాట్స్‌మెన్‌గా, రెండవ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గా మారాడు.

చరిత్ర సృష్టించిన జో రూట్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు.. ఆ లిస్టులో అగ్రస్థానం.. సచిన్ ఎక్కడనున్నాడంటే?
Joe Root
Follow us on

Joe Root 10000 Test Runs: ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో, జో రూట్ తన సెంచరీని పూర్తి చేశాడు. అలాగే టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేశాడు. జో రూట్ రెండో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. అంతకుముందు అలిస్టర్ కుక్ మాత్రమే ఇంగ్లండ్ తరపున ఈ లిస్టులో నిలిచాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేసింది. అయితే ఇందులో జో రూట్ రికార్డు కూడా అత్యంత ముఖ్యమైనది. జో రూట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సారథి నుంచి తప్పుకున్న తర్వాత తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న జోరూట్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

31 సంవత్సరాల జో రూట్.. 90లలో జన్మించి టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. విశేషమేమిటంటే.. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో తొలిసారి పదివేల పరుగులు చేసిన అలిస్టర్ కుక్.. 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.

జో రూట్ టెస్ట్ రికార్డ్:

ఇవి కూడా చదవండి

113 టెస్టులు, 10015 పరుగులు, 49.57 సగటు

26 సెంచరీలు, 53 అర్ధశతకాలు, 254 అత్యధిక స్కోర్లు

ఇంగ్లండ్‌ తరపున 10 వేలకు పైగా టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్లు..

అలిస్టర్ కుక్ – 12472

జో రూట్ – 10015

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డులు చేసిన బ్యాట్స్‌మెన్స్..

1. సచిన్ టెండూల్కర్ – 15921

2. రికీ పాంటింగ్ – 13378

3. జాక్వెస్ కల్లిస్- 43289

4. రాహుల్ ద్రవిడ్ – 13288

5. అలిస్టర్ కుక్ – 12472

6 . కుమార్ సంగక్కర- 12400

7. బ్రియాన్ లారా- 11953

8. శివనారాయణ చంద్రపాల్- 118679

9. మహేల జయవర్ధనే- 11814

10 . అలన్ బోర్డర్ – 11174

11. స్టీవ్ వా – 10927

12. సునీల్ గవాస్కర్ – 10122

13. యూనస్ ఖాన్ – 10099

14. జో రూట్ – 10015