Watch Video: యాషెస్‌లో డేంజరస్ స్వింగ్ బాల్ ఇదే.. దెబ్బకు వార్నర్‌ మైండ్ బ్లాంక్.. వీడియో చూస్తే షాకే..

|

Jun 29, 2023 | 11:40 AM

ENG vs AUS 2nd Test: తన మొదటి టెస్ట్ ఆడుతున్న జోష్ టోంగ్, లార్డ్స్ టెస్ట్ మొదటి రోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన తర్వాత డేవిడ్ వార్నర్‌ను కూడా అవుట్ చేసి షాకిచ్చాడు.

Watch Video: యాషెస్‌లో డేంజరస్ స్వింగ్ బాల్ ఇదే.. దెబ్బకు వార్నర్‌ మైండ్ బ్లాంక్.. వీడియో చూస్తే షాకే..
Josh Tongue Deadly Swing
Follow us on

Josh Tongue Deadly Swing Video: యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం తొలి గంటన్నర పాటు తప్పుగా అనిపించింది. అయితే, ఆ తర్వాత యువ జోష్‌ టంగ్‌కి బంతిని అందించిన వెంటనే, ఈ నిర్ణయం సరైనదేనని అనింపించింది.

తన తొలి టెస్టు ఆడుతున్న జోష్ టోంగ్ ముందుగా ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేశాడు. ఖవాజా అద్భుతమైన బంతికి టాంగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొంతసేపటికి వేగంగా స్కోరు చేస్తున్న డేవిడ్ వార్నర్ కూడా జోష్ టంగ్ ముందు నిస్సహాయంగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

జోష్ టంగ్ ఫాటల్ స్వింగ్ బాల్‌కి వార్నర్‌ వద్ద సమాధానం లేకపోయింది. వార్నర్ యాషెస్‌లోకి ఉత్తమ స్వింగ్ బాల్ ఆఫ్ ది ఇయర్‌కి బౌల్డ్ అయ్యాడు. ఈ బంతి స్టార్ బ్యాటర్ వార్నర్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. బౌల్డ్‌ అయిన తర్వాత వార్నర్ స్పందన కూడా చూడదగ్గదే. వార్నర్‌ బౌల్డ్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది.

అంతకుముందు జోష్ టోంగ్ వేసిన బంతిని వదిలేసి ఉస్మాన్ ఖవాజా బౌల్డ్ అయ్యాడు. వాస్తవానికి, బంతి వికెట్ నుంచి చాలా దూరం వెళుతుందని ఖవాజా భావించాడు. కానీ, స్వింగ్ అయిన తర్వాత బంతి లోపలికి వచ్చింది. దీంతో ఖవాజా బౌల్డ్ అయ్యాడు.

88 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 66 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ బౌల్డ్ అయ్యాడు. అదే సమయంలో ఉస్మాన్ ఖవాజా 70 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 17 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..