IND vs WI : మా వాళ్లను అంత దారుణంగా కొట్టొద్దు బాబూ.. జైస్వాల్ విధ్వంసానికి లారా ఫిదా
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా నేరుగా యశస్వి జైస్వాల్ వద్దకు వచ్చి అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు. జైస్వాల్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని అభినందించాడు.

IND vs WI : టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అయితే, అతని విధ్వంసకర బ్యాటింగ్ చూసి ప్రత్యర్థి జట్టు దిగ్గజం బ్రయాన్ లారా ముగ్ధుడయ్యాడు. మ్యాచ్ అనంతరం జైస్వాల్‌ను కలిసి అభినందించడమే కాకుండా, సరదాగా ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశాడు. “బాబూ, మా బౌలర్లను అంత దారుణంగా కొట్టొద్దు” అంటూ లారా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా నేరుగా యశస్వి జైస్వాల్ వద్దకు వచ్చి అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు. జైస్వాల్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని అభినందించాడు. ఆ తర్వాత నవ్వుతూ.. “మా బౌలర్లను ఇంత దారుణంగా కొట్టొద్దు” అని సరదాగా విజ్ఞప్తి చేశాడు. లారా వంటి లెజెండ్ నుంచి వచ్చిన ఈ ప్రశంసకు, సరదా వ్యాఖ్యకు జైస్వాల్ కూడా నవ్వుతూ బదులిచ్చాడు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఆడిన తీరుకు వెస్టిండీస్ బౌలర్లు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. క్రీజులో పాతుకుపోయి, బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ భారీ స్కోరు సాధించాడు. కేవలం 175 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు రనౌట్ అవ్వడంతో తన మూడో డబుల్ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా 92వ ఓవర్లో జైస్వాల్ తన వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. లేకపోతే స్కోరు మరింత భారీగా ఉండేది.
తన బ్యాటింగ్ మైండ్‌సెట్ గురించి జైస్వాల్ మాట్లాడుతూ.. “నా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ జట్టుకే. జట్టుకు ఏం అవసరమో ఆలోచించి ఆడతాను. అందుకే ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే, ఆ ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మార్చడానికి ప్రయత్నిస్తాను” అని అన్నాడు. తన సహచర బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. “గిల్ భాయ్ అద్భుతంగా ఆడాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం, గేమ్‌ను ముందుకు తీసుకెళ్లే శైలి అమోఘం” అని ప్రశంసించాడు. జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




