AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siraj DSP Salary: సిరాజ్ డీఎస్పీ జీతం ఎంతో తెలుసా..? అతడి మొత్తం ఆస్తి ఎన్ని కోట్లు అంటే..?

డీఎస్పీ సిరాజ్ ప్రస్తుతం నెలకు రూ.58,850 నుండి రూ.1,37050 వరకు జీతం పొందుతున్నాడు. దీంతో పాటు అతనికి ఇతర అలవెన్సులు అందుతాయి. ఈ జీతం 7వ వేతన సంఘం ప్రకారం ఇస్తున్నారు. ఒకవేళ 8వ ఆర్థిక సంఘం ప్రకారం అయితే సిరాజ్ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?

Siraj DSP Salary: సిరాజ్ డీఎస్పీ జీతం ఎంతో తెలుసా..? అతడి మొత్తం ఆస్తి ఎన్ని కోట్లు అంటే..?
Siraj DSP Salary
Krishna S
|

Updated on: Aug 07, 2025 | 10:27 PM

Share

మొహమ్మద్ సిరాజ్.. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన బౌలింగ్‌తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. సిరాజ్ ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి శభాష్ అనిపించుకున్నాడు. సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో చివరి టెస్టులో భారత్ విజయం సాధించి.. టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసింది. దాంతో సిరాజ్ పేరు మార్మోగిపోయింది.

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిరాజ్ తన ఆటతో బాగానే సంపాదించాడు. అతని కృషి, ప్రతిభ అతన్ని విజయ శిఖరాలకు తీసుకెళ్లాయి. గత కొన్నేళ్లుగా సిరాజ్ సంపాదన క్రమంగా పెరిగింది. నేడు కోట్ల రూపాయల ఆస్తికి యజమాని. ఖరీదైన ఇల్లు, ఖరీదైన కార్లు అతని వద్ద ఉన్నాయి. సిరాజ్ బీసీసీఐ నుంచి ఏటా కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. దీంతో పాటు IPL నుండి గట్టిగానే వెనకేస్తున్నాడు. ఇవన్ని పక్కనబెడితే సిరాజ్ తెలంగాణ పోలీస్‌ శాఖలో కీలక పదవిలో ఉన్నారు. డీఎస్పీ హోదాలో పనిచేస్తున్నాడు. అతనికి భారీ జీతం కూడా లభిస్తుంది. అదే సమయంలో అతను బ్రాండ్ ఒప్పందాల ద్వారా కూడా చాలా డబ్బు సంపాదిస్తాడు.

డీఎస్పీగా సిరాజ్ జీతం

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అతనికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవిని కట్టబెట్టింది. అయితే డీఎస్పీగా సిరాజ్ ప్రస్తుతం నెలకు 58,850 నుండి 1,37050 వరకు జీతం అందుకుంటున్నాడు. దీంతో పాటు అతను ఇంటి రెంట్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ సహా ఇతర భత్యాలు అందుకున్నాడు. ఈ జీతం 7వ వేతన సంఘం ప్రకారం వస్తుంది. దీనిలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 వద్ద ఉంది. ఇప్పుడు 8వ వేతన సంఘం అమలు చేస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ దాదాపు 2.57కి పెరుగుతుంది. దీంతో సిరాజ్ జీతం భారీగా పెరుగనుంది. అటువంటి పరిస్థితిలో, వారి కనీస జీతం 80,000 కంటే ఎక్కువగా ఉండవచ్చు. గరిష్ట జీతం 1.85 లక్షలకు చేరుకోవచ్చు.

బీసీసీఐ – ఐపీఎల్ ద్వారా..

2024-25 ఏడాదికి సిరాజ్ యొక్క బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రూ. 5 కోట్లు. దీంతో పాటు అతని మ్యాచ్ ఫీజు సపరేట్. సిరాజ్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతంలో అతను ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం గుజరాత్ అతనికి రూ. 12.25 కోట్లు చెల్లిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం.. సిరాజ్ మొత్తం నికర విలువ రూ. 57 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..