Disney+ Hotstar: క్రికెట్ అభిమానులకు శుభవార్త. త్వరలో జరగబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లను ఉచితంగా చూసే వెసులుబాటును కల్పిస్తోంది డిస్నీ హాట్‌స్టార్. నమ్మలేకపోతున్నారా..? కానీ ఇది నిజం. అవును, ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌ను ఉచితంగానే ప్రసారం చేసిన జియోసినిమా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. జియో సినిమాలో ఐపిఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయడంతో దాదాపు 45 కోట్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ధనాధన్ లీగ్ మ్యాచ్‌లను వీక్షించగలిగారు. అలాగే 3 కోట్ల మందికి పైగా ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి రికార్డు నమోదు చేశారు. అయితే అంతకముందు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన డిస్నీ హాట్‌స్టార్ (డిస్నీ+ హాట్‌స్టార్) ఈ విధమైన ఆదరణను పొందలేదు. ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరి చేయడంతో అంతా చూసేందు కంటే స్కోర్ ఫాల్లో అవడానికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన 16వ సీజన్ ఐపీఎల్ టోర్నీ ద్వారా జియో సినిమా సాధించిన హాట్‌స్టార్ వీక్షకుల సంఖ్య అఖండ విజయం.. హాట్‌స్టార్‌ని తన వ్యూహాన్ని మార్చుకునేలా చేసింది.
డిస్నీ హాట్‌స్టార్ జూన్ 8న భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌లను వీలైనన్ని ఎక్కువ మంది వీక్షించేలా ఉచితంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఐపిఎల్ టోర్నమెంట్ సమయంలో కోల్పోయిన కోట్లాది మంది వీక్షకులను తిరిగి పొందాలని హాట్‌స్టార్ భావిస్తోందని అర్థమవుతోంది. వీక్షకులను తన ప్లాట్‌ఫారమ్‌కి ఆకర్షించడానికి క్రికెట్‌ను మించిన సాధనం మరొకటి లేదని జియోకు తెలుసు కాబట్టి 2023 IPL మ్యాచ్‌లను తొలిసారిగా డిజిటల్ ప్లాట్‌ఫార్‌మ్‌లో ఉచితంగా ప్రసారం చేసింది. తద్వారా ఎంతో మంది వినియోగదారులను ఆకర్షించగలిగింది. అయితే జియో సినిమా ఇలా చేయడం ద్వారా డిస్నీ హాట్‌స్టార్ ఎంతో మంది వినియోగదారులతో పాటు సబ్‌స్రైబర్లను కూడా పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఉచితంగానే ప్రసారం చేస్తోంది. ఇదే తరహాలో ఆసియా కప్, ICC ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను ఉచితంగానే ప్రస్తారం చేసి జనాదరణ పొందాలని హాట్‌స్టార్ భావిస్తోంది.
IPL 2023 టోర్నమెంట్‌లో జియోసినిమా మాత్రమే కాకుండా స్టార్ గ్రూప్ కూడా భారీ లాభాలను ఆర్జించింది . జియో డిజిటల్ ప్రసార హక్కులను కలిగి ఉండగా, స్టార్ టీవీ ప్రసార హక్కులను కలిగి ఉంది. జియోలో క్రికెట్ చూస్తున్న వారి సంఖ్య 44 కోట్లు కాగా , స్టార్ ఛానెల్స్ ద్వారా టీవీల్లో ఐపీఎల్ చూస్తున్న వారి సంఖ్య 50 కోట్లు ఉంటుందని అంచనా. జియో, స్టార్ రెండూ రికార్డు వీక్షకుల సంఖ్యను కలిగి ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..