AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హిట్ వికెట్‌గా నరైన్ ఔట్.. అప్పీల్ చేయని ఆర్‌సీబీ.. కట్‌చేస్తే అదిరిపోయే ట్విస్ట్

Sunil Narine Hit Wicket Video: ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెనెజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆట తొలి ఓవర్‌లోనే క్వింటన్ డి కాక్ వికెట్ తీసి, ఆతిథ్య జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆర్‌సీబీ.

Video: హిట్ వికెట్‌గా నరైన్ ఔట్.. అప్పీల్ చేయని ఆర్‌సీబీ.. కట్‌చేస్తే అదిరిపోయే ట్విస్ట్
Untitled Design
Venkata Chari
|

Updated on: Mar 22, 2025 | 9:05 PM

Share

Sunil Narine Hit Wicket Video: ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెనెజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆట తొలి ఓవర్‌లోనే క్వింటన్ డి కాక్ వికెట్ తీసి, ఆతిథ్య జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆర్‌సీబీ.

ఈడెన్ గార్డెన్స్‌లో అజింక్య రహానే బీభత్సం..

డి కాక్ ఔట్ అయిన తర్వాత, రహానే సునీల్ నరైన్‌తో కలిసి దాడికి దిగాడు. ఈ జోడీ స్టేడియం మొత్తాన్ని ఒక్కసారిగా తమ బ్యాటింగ్‌తో ఊపేసింది. ముఖ్యంగా రహానే మైదానంలోని అన్ని ప్రాంతాలకు ఆర్‌సీబీ బౌలర్లను పంపించేలా చేసి, కేకేఆర్ స్కోర్‌ను ఆమాంతం పెంచేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ భాగస్వామ్యం బలంగా సాగుతున్న సమయంలో ఈడెన్ గార్డెన్స్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సునీల్ నరైన్‌ చేసిన ఓ తప్పిదం బెంగళూరు జట్టుకు కనిపించలేదు. దీంతో హిట్ వికెట్‌గా వెనుదిరగాల్సిన సునీల్ నరైన్‌ నాటౌట్‌గా నిలిచి ఇరగదీసేలా చేశారు. ఏడో ఓవర్ నాలుగో డెలివరీలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ సునీల్ నరైన్ షార్ట్ బాల్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

హిట్ వికెట్ కోసం అప్పీల్ చేయని బెంగళూరు..

నరైన్ పుల్ షాట్ కొట్టలేకపోయాడు. లెగ్ అంపైర్ బంతిని వైడ్ అని సూచించాడు. కానీ, రీప్లేలలో నరైన్ బ్యాట్ స్టంప్స్‌ను తాకినట్లు కనిపించింది. అక్కడే ఉన్న రజత్ పాటిదార్ ఔట్ కోసం అప్పీల్ చేయాలని కోరుతున్నట్లు కనిపించాడు. అయితే, ఎటువంటి ఫలితం రాలేదు. టిమ్ డేవిడ్ కూడా అవుట్ కోసం అప్పీల్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అనిపించింది.

అంపైర్ బంతిని వైడ్ అని ప్రకటించడంతో బంతి అప్పటికే డెడ్ అయినట్లు కనిపిస్తోంది. అందువల్ల, RCB హిట్ వికెట్ కోసం అప్పీల్ చేసినా, అది నిలబడేది కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..