
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. అంటే, ఈ బ్లాక్ బస్టర్ పోటీకి ఇంకా దాదాపు రెండు వారాలు మిగిలి ఉన్నాయి. కానీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఇప్పటికే ‘యుద్ధం’ ప్రకటించాడు. భారతదేశాన్ని ఓడించడం గురించి మాట్లాడి, సంచలనంగా మారాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన తన ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని అతను జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఇతర ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు.
చివరిసారి 2017 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. అప్పుడు పాకిస్తాన్ టీం ఇండియాను ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మరోసరి రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. అంతకుముందు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం మాత్రమే కాదు, పొరుగు దేశాన్ని ఓడించాలంటూ చెప్పుకొచ్చాడు. రాబోయే టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ జట్టు జెర్సీ, గడాఫీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు.
Shehbaz Sharif owning 1.6 billion
That was Personal 😭 pic.twitter.com/1OfxxTfomq
— Jalaad 🔥 حمزہ (@SaithHamzamir) February 7, 2025
ప్రస్తుతం, భారతదేశానికి చెందిన జస్‌ప్రీత్ బుమ్రా రివర్స్ స్వింగ్‌లో నిపుణుడు. కానీ, అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై సస్పెన్స్ ఉంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే, ఈ టోర్నమెంట్‌లో పొరుగు దేశానికే పైచేయి. సాధారణంగా ఐసీసీ ఈవెంట్లలో టీం ఇండియా ఎక్కువ విజయాలు సాధిస్తుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 2 సార్లు, పాకిస్తాన్ 3 సార్లు గెలిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..