ICC W Rankings : ఒక్క పాయింట్ తేడా..ఆస్ట్రేలియా స్టార్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న భారత బౌలర్
ICC W Rankings : అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. తన కెరీర్‌లో ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానకు వన్డే ర్యాంకింగ్స్‌లో నిరాశ ఎదురైంది.

ICC W Rankings : అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. తన కెరీర్‌లో ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానకు వన్డే ర్యాంకింగ్స్‌లో నిరాశ ఎదురైంది. విశాఖపట్నంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 20 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసింది. ఈ ప్రదర్శనతో ఆమెకు 737 రేటింగ్ పాయింట్లు లభించాయి. తద్వారా ఆస్ట్రేలియా పేసర్ అనాబెల్ సదర్‌ల్యాండ్ (736)ను ఒక్క పాయింట్ తేడాతో వెనక్కి నెట్టి దీప్తి అగ్రస్థానానికి చేరుకుంది. 2025 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి, ఇప్పుడు టీ20ల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుస సెంచరీలు బాది 820 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానానికి చేరుకుంది. దీనితో స్మృతి 811 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. అయితే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం స్మృతి మూడో స్థానంలో కొనసాగుతూ తన సత్తా చాటుతోంది.
టీ20 బ్యాటింగ్ విభాగంలో జెమీమా రోడ్రిగ్స్ భారీగా పుంజుకుంది. శ్రీలంకపై 44 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన జెమీమా, ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకుకు చేరుకుంది. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్ టాప్-10లో స్మృతి మంధాన (3), జెమీమా రోడ్రిగ్స్ (9), షెఫాలీ వర్మ (10) ముగ్గురు భారత క్రీడాకారిణులు ఉండటం విశేషం.
భారత పేసర్ అరుంధతి రెడ్డి కూడా తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 36వ ర్యాంకుకు చేరుకుంది. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా ప్లేయర్ సునే లూస్ కూడా బ్యాటింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
