DC vs SRH Match Report: ఎస్‌ఆర్‌హెచ్‌కు ఊహించని షాక్.. ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఓటమి

DC vs SRH Match Report: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం వరుసగా రెండో ఓటమితో 6వ స్థానానికి పడిపోయింది.

DC vs SRH Match Report: ఎస్‌ఆర్‌హెచ్‌కు ఊహించని షాక్.. ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఓటమి
Delhi Capitals Vs Sunrisers Hyderabad

Updated on: Mar 30, 2025 | 6:57 PM

DC vs SRH Match Report: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం వరుసగా రెండో ఓటమితో 6వ స్థానానికి పడిపోయింది.

హైదరాబాద్ విధించిన 164 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో ఢిల్లీ ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జాక్ ఫేజర్ మాగార్క్ 38 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి 81 పరుగుల తొలి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 15 పరుగులతో నిరాశ పరిచాడు. అభిషేక్ పోరెల్ 34 పరుగులతో, ట్రిస్టన్ స్టబ్స్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఢిల్లీకి విజయం అందించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున జీషన్ అన్సారీ 3 వికెట్లు పడగొట్టాడు.

విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తప్పని తొలి ఓవర్‌లోనే నిరూపితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 ​​పరుగులకు ఆలౌటైంది. అనికేత్ వర్మ 41 బంతుల్లో 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11..

ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), జాక్ ఫ్రేజర్-మగార్క్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ట్రిస్టాన్ స్టబ్స్, విపరాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ మరియు ముఖేష్ కుమార్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: అశుతోష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: వియాన్ ముల్డర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..