Dasun Shanaka spent 30 runs in 3 balls in Abu Dhabi T10 match: శ్రీలంక మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ దాసున్ షనక వార్తల్లో నిలిచాడు. దీనికి కారణం సానుకూలమైనది మాత్రం కాదండోయ్. వాస్తవానికి, అబుదాబి టీ-10 లీగ్‌లో ఆడుతున్న షనక విషయంలో ఊహించనిది చోటు చేసుకుంది. ఆ తర్వాత అతనిని ఫిక్సింగ్ చేశాడంటూ ఆరోపణలు గుప్పతిస్తున్నారు. అత్యధికంగా 48 టీ-20 ఇంటర్నేషనల్స్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన షనక గత ఏడాది మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణలు ఆయన ప్రతిష్టను దిగజార్చాయి. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..
ఢిల్లీ బుల్స్‌తో జరిగిన 10 ఓవర్ల మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన షనక.. తొలి మూడు బంతుల్లో 30 పరుగులు ఇచ్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ సంధించాడు.
ఈ ఓవర్ తర్వాత, సోషల్ మీడియాలో అతనిని ఫిక్సింగ్ చేశాడంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. 4 నోబాల్స్ వేయడమే ఇందుకు కారణం అంటూ చెబుతున్నారు.
Dasun Shanaka – 4 No balls in an over. @ICC This T10 league is becoming a joke and all kind of chances for fixing. 33 runs and 4 no balls from a player like Shanaka!! pic.twitter.com/zll01wjACx
— Sandeep (@sandeep_Vishu) November 25, 2024
ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “స్పష్టంగా ఇవి నో-బాల్స. ఈ లీగ్‌లను ICC దర్యాప్తు చేయాలి. ప్రస్తుతం దసున్ షనక శ్రీలంక కెప్టెన్‌గా ఉండటం చాలా విచిత్రం.” అంటూ రాసుకొచ్చాడు.
Well done dasun shanaka maan gaye bhai no balls ki line lagadi 33 runs in 1 over 😂 pic.twitter.com/FakZTXqxUc
— SAGAR THE TIPSTER (@GunjkarSagar) November 25, 2024
మరో వినియోగదారు “అబుదాబి T10 లీగ్‌లో ఇలా కూడా ఫిక్సింగ్ ఉంటుందా? దాసున్ షనక ఒక ఓవర్‌లో నాలుగు నో-బాల్‌లు వేయడమేంటి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను శ్రీలంకకు ఎప్పుడూ నో-బాల్ వేయలేదు” అంటూ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..