Danushka Gunathilaka: రేప్‌ కేసులో లంక క్రికెటర్‌కు బెయిల్‌ నిరాకరణ.. జీవితఖైదు తప్పదంటోన్న ఆస్ట్రేలియా చట్టాలు

ఆస్ట్రేలియా చట్టాల  ప్రకారం రేపిస్టులకు జీవిత ఖైదు విధిస్తారు. ఈనేపథ్యంలో లంక క్రికెటర్ ధనుష్కకు కూడా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Danushka Gunathilaka: రేప్‌ కేసులో లంక క్రికెటర్‌కు బెయిల్‌ నిరాకరణ.. జీవితఖైదు తప్పదంటోన్న ఆస్ట్రేలియా చట్టాలు
Danushka Gunathilaka

Updated on: Nov 07, 2022 | 1:46 PM

అత్యాచారం కేసులో అరెస్టైన శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకకు సిడ్నీ కోర్టులో చుక్కెదురైంది. అతనికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. అయితే బెయిల్ కోసం గుణతిలక్ ఇప్పుడు మరోసారి న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా అతనికి బెయిల్‌ రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా చట్టాల  ప్రకారం రేపిస్టులకు జీవిత ఖైదు విధిస్తారు. ఈనేపథ్యంలో ధనుష్కకు కూడా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఓ యువతిపై నవంబర్ 2న ధనుష్క అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అతనిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి నిష్ర్కమించిన శ్రీలంక జట్టు ధనుష్క లేకుండానే స్వదేశానికి వెళ్లిపోయింది.

జట్టు నుంచి బహిష్కరణ..

2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన ధనుష్క ఇప్పటివరకు ఎనిమిది టెస్ట్, 47 వన్డే, 46 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అయితే ఆటతోనే కాదు వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడీ స్టార బ్యాటర్‌. 2018లో, గుణతిలక్ తన ఫ్రెండ్‌తో కలిసి ఓ నార్వేజియన్ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు అతనిపై 6 మ్యాచ్‌ల సస్పెన్షన్‌ విధించింది. అయినా తీరు మార్చుకోని ధనుష్క ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా అతనిపై గుర్రుగా ఉంది. ఆస్ట్రేలియా పోలీసుల విచారణలతో తాము అన్ని విధాలా సహకరిస్తామని ఇప్పటికే ఓ ప్రకటన వెలువరించింది. తాజాగా అన్ని రకాల క్రికెట్‌ఫార్మాట్ల నుంచి అతనిని బహిష్కరిస్తున్నట్లు శ్రీలంక బోర్డు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..