SRH వరుస ఓటములు….కమిన్స్‌ చెప్పిన కారణాలు ఇవే!

IPL 2025: సన్‌రైజర్స్‌ వరుస ఓటములపై కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి గెలుపు తర్వాత తమ జట్టు ప్లేయర్స్‌ ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయని..బ్యాటింగ్‌లో కాస్త రాణించినప్పటికీ..ఫీల్డింగ్, బౌలింగ్‌ విషయంలో చేతులెత్తేయడమే తమ ఓటమి కారణమని కమిన్స్ అన్నారు.

SRH వరుస ఓటములు....కమిన్స్‌ చెప్పిన కారణాలు ఇవే!
Cummins On Srh Lose

Updated on: Apr 04, 2025 | 1:44 PM

ఐపీఎల్‌లో రికార్డు క్రియేట్ చేసి సీజన్ 18ను ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇప్పుడు వరుస పరాజయాలు తప్పడం లేదు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్‌ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌లో భారీ ఓటమిని చవిచూసింది. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2024 టైటిల్ విన్నర్స్ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో SRH ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌  పర్ఫామెన్స్‌ చూసిన అభిమానులు..SRHకు ఇక తీరుగులేదు…ఈసారి టైటిల్‌ SRH దేనని అనుకున్నారు..కానీ ఇప్పుడు జట్టు ఆటతీరును చూసి తమ అంచనాలు తప్పనే భావనకు వస్తున్నారు.

కేకేఆర్ తో జట్టు ఓటమి పై సన్‌రైజర్స్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అభిమానులు ఊహించన మేరకు తమ ప్రదర్శన ఉండట్లేదన్నారు. బ్యాటింగ్‌లో కాస్తా పర్వాలేదనిపించుకున్నా…బౌలింగ్‌ విషయంలో ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. జట్టు ఓటమికి బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లు మిస్‌ చేయడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా క్యాచ్‌లు మిస్‌ చేయడం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో  ప్లేయర్స్‌ తమ ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయ పడ్డారు. ప్లేయర్స్ అందరూ సమిష్టిగా రాణిస్తే రాబోయే మ్యాచుల్లో విజయాల బాట పట్టవచ్చని కమిన్స్‌ స్పష్టం చేశారు.