AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK: ప్లేఆఫ్స్‌కి ముందు చెన్నై సంచలన నిర్ణయం.. రంగంలోకి కొత్త ప్లేయర్.. ఎందుకంటే?

CSK New Signing IPL 2026: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు చేరువవుతున్న వేళ ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన ప్రతిభావంత ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న సీఎస్‌కేకు ఈ కొత్త ఆటగాడి రాక ఎంతవరకు కలిసొస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

CSK: ప్లేఆఫ్స్‌కి ముందు చెన్నై సంచలన నిర్ణయం.. రంగంలోకి కొత్త ప్లేయర్.. ఎందుకంటే?
Csk Punish Player Jishan Adil Due To Social Media
Venkata Chari
|

Updated on: May 13, 2026 | 10:15 AM

Share

CSK New Signing IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్ నుంచి వైదొలిగాడు. మే 2వ తేదీన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రామకృష్ణ, తన బౌలింగ్ ఫాలో-త్రూలో కింద పడటంతో కుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. విల్ జాక్స్‌ను అవుట్ చేయడానికి అతను పట్టిన డైవింగ్ క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది. అయితే, దురదృష్టవశాత్తు గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను టోర్నీకి దూరమయ్యాడు. దీనిపై స్పందించిన సీఎస్‌కే యాజమాన్యం, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

జట్టులోకి మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హా.. ఎవరితను?

రామకృష్ణ స్థానంలో కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల ఆల్‌రౌండర్ మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హాను చెన్నై ఒప్పందం చేసుకుంది. గతేడాది మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరపున ఆడిన నోరోన్హా అద్భుత ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 253 పరుగులు చేయడంతో పాటు, 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 148 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ భారీ సిక్సర్లు బాదడంలో ఇతను దిట్ట. ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తోనూ ప్రత్యర్థిని కట్టడి చేయగల సామర్థ్యం ఇతని సొంతం.

స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన..

హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రామకృష్ణ గాయంపై విచారం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా అతను అకాడమీ సెషన్లలో ఎంతో కష్టపడి మెరుగయ్యాడని, ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడతాడనుకున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే, కొత్తగా వచ్చిన నోరోన్హా జట్టు అవసరాలను తీరుస్తాడని ఫ్లెమింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గాయాల బెడదలో చెన్నై సూపర్ కింగ్స్..

ఈ సీజన్ చెన్నై జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కీలక బౌలర్ ఖలీల్ అహ్మద్, యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే జట్టుకు దూరమవ్వగా, స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ కూడా కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. పేస్ విభాగంలో నాథన్ ఎల్లిస్ అందుబాటులో లేకపోవడం, స్పెన్సర్ జాన్సన్ ఆలస్యంగా చేరడం జట్టును ఇబ్బంది పెట్టింది. లీగ్ దశలో మిగిలి ఉన్న మూడు మ్యాచ్‌లు చెన్నైకి అత్యంత కీలకం కానున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చెన్నై సంచలన నిర్ణయం.. రంగంలోకి కొత్త ప్లేయర్.. ఎందుకంటే?
చెన్నై సంచలన నిర్ణయం.. రంగంలోకి కొత్త ప్లేయర్.. ఎందుకంటే?
స్టార్ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్.. కట్ చేస్తే.. తోపు కమెడియన్..
స్టార్ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్.. కట్ చేస్తే.. తోపు కమెడియన్..
వ్యక్తిగతంగా ఇంధన ఆదా చర్యలు ప్రారంభించిన ప్రధాని మోదీ
వ్యక్తిగతంగా ఇంధన ఆదా చర్యలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌ నుంచి అతనొక్కడే వచ్చాడు:తన్మయి
మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌ నుంచి అతనొక్కడే వచ్చాడు:తన్మయి
తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష..
తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష..
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!