IPL 2025: ఆ పిచ్చొడ్ని టీమ్‌లోకి తెచ్చుకున్న ధోని! ఇక కాసుకోండి.. సీఎస్‌కేను ఆపగలరా..?
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో నిరాశపరిచే ప్రదర్శన కనబరుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్ రుతురాజ్ గాయం, ఇతర సమస్యల నేపథ్యంలో, సౌతాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను జట్టులో చేర్చుకుంది. బ్రెవిస్ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో జట్టుకు ఊపునివ్వాలని సీఎస్కే ఆశిస్తోంది.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన వాళ్ల స్థాయికి తగ్గట్లు లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్‌గా ముంబై ఇండియన్స్‌తో కలిసి తొలి స్థానంలో ఉన్న సీఎస్‌కే.. ఈ సీజన్‌లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 4 పాయింట్లు, -1.276 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
గతంలో ఏ సీజన్‌లో కూడా 7 మ్యాచ్‌లు పూర్తి అయిన తర్వాత సీఎస్‌కే జట్టు ఇంత దారుణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో లేదు. 5 మ్యాచ్‌లు పూర్తి అయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయ పడటంతో అతని స్థానంలో ధోనినే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆ జట్టులోని మరో ప్లేయర్ గాయపడటంతో అతని రీప్లేస్‌మెంట్‌గా సీఎస్‌కే ఓ పిచ్చోడ్ని టీమ్‌లోకి తెచ్చుకుంది. మరి ఆ ప్లేయర్ ఎవరో? సీఎస్‌కే ఎంత యూజ్ అవుతాడో ఇప్పుడు తెలుసుకుందాం.. సీఎస్‌కే ప్లేయర్ గుర్జప్నీత్ స్థానంలో సౌతాఫ్రికా యంగ్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను తీసుకుంది సీఎస్‌కే. ఇది నిజంగా చాలా మంది రీప్లేస్‌మెంట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. సీఎస్‌కే టీమ్‌లో టాప్ ఆర్డర్‌లో ఆడేందుకు ఒక అగ్రెసివ్ ప్లేయర్ లేదు.
ఇప్పుడు బ్రెవిస్ రాకతో వన్ డౌన్‌లో అతన్ని ఆడించే ఛాన్స్ ఉంది. లోయర్ ఆర్డర్‌లో కూడా ఆడించే అవకాశం ఉంది. ఎక్కడ ఆడించినా కూడా బ్రెవిస్‌కు తెలిసిందే ఒక్కటే.. తన స్లాట్‌లో బంతి పడిందా అది స్టాండ్స్‌లోకి కొట్టడమే. ముఖ్యంగా అతను కొట్టే నో లుక్ షాట్లు చాలా స్పెషల్‌గా ఉంటాయి. గతంలో ముంబై ఇండియన్స్ టీమ్‌కి కూడా బ్రెవిస్ ఆడాడు. అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసే బ్రెవిస్.. కన్సిస్టెన్సీ లేకపోవడంతో ముంబై టీమ్‌లో మళ్లీ స్థానం సంపాదించలేకపోయాడు. కానీ, ఇప్పుడు సీఎస్‌కేకు కన్సిస్టెన్స్ కంటే కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఊపు తెచ్చే ఓ పిచ్చికొట్టుడు బ్యాటర్ అసవరం ఉంది. ఇప్పుడు బ్రెవిస్ రాకతో ఆ ఎనర్జీ వస్తుందని సీఎస్‌కే భావిస్తోంది. మరి చూడాలి బ్రెవిస్ ఎంత వరకు జట్టుకు న్యాయం చేస్తాడో.
Bringing a whole lot of Protea Firepower! 💪🏻#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/9seFMWU1fI
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




