
CSK Retained Players 2026: ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆశించిన ఫలితాలు రాబట్టలేక పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఐపీఎల్ 2026 మినీ-వేలం కోసం తమ జట్టులో కీలక మార్పులు చేయాలని చూస్తోంది. తమ బృందాన్ని పటిష్టం చేసుకోవడానికి, పర్స్‌ను పెంచుకోవడానికి సీఎస్కే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ఫైనల్ లిస్ట్‌ను ఫ్రాంచైజీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లిస్ట్‌ను నవంబర్ 15న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు చెన్నై సూపర్ కింగ్స్ రిటైర్ చేసుకునే ఆటగాళ్లు ఎవరు, ఎవరికి బిగ్ షాక్ ఇవ్వనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేతో మూడేళ్ల అనుబంధం తర్వాత ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, జామీ ఓవర్టన్ వంటి ఆటగాళ్లను కూడా తిరిగి వేలానికి పంపే అవకాశం ఉంది. తద్వారా ఫ్రాంచైజీ తమ పర్స్‌ను పెంచుకునే అవకాశం ఉంది.
1. రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు: చెన్నై తమ కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అనుభవం, భవిష్యత్తు సామర్థ్యంతోపాటు జట్టు అవసరాల దృష్ట్యా ఈ ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.
| ఆటగాడు | కారణం |
|---|---|
| ఎంఎస్ ధోని | జట్టుకు కీలకమైన ఆటగాడు, మార్గదర్శకుడు, కెప్టెన్సీ అనుభవం. |
| శివమ్ దూబే | బ్యాటింగ్‌లో అత్యంత కీలకమైన, దూకుడుగా ఆడే భారతీయ ఆటగాడు. |
| రవీంద్ర జడేజా* | ఆల్ రౌండర్, అత్యుత్తమ ప్రదర్శనతోపాటు స్పిన్ బౌలింగ్, ఫీల్డింగ్. |
| రచిన్ రవీంద్ర | గత సీజన్లో నిరాశపరిచినా, దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా అట్టిపెట్టుకోవచ్చు. |
| దీపక్ హుడా | డొమెస్టిక్ ఫామ్ కారణంగా ఆశ్చర్యకరంగా రిటైన్ చేసే అవకాశం ఉంది. |
| శ్రేయాస్ గోపాల్ | స్పిన్ విభాగంలో ఉపయోగపడే భారతీయ ఆటగాడు. |
| మతీశ పతిరణ* | కీలకమైన డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్. |
| ఖలీల్ అహ్మద్ | వేగవంతమైన లెఫ్ట్-ఆర్మ్ పేసర్. |
| సామ్ కరన్* | విదేశీ ఆల్రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్‌లో ఉపయోగపడతాడు. |
| ఇతరులు (కోర్ గ్రూప్‌లో): | ఆండ్రీ సిద్ధార్థ్, ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, డెవాల్డ్ బ్రెవిస్, రామకృష్ణ ఘోష్, ఉర్విల్ పటేల్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్. |
2. విడుదల చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లు: పర్స్‌లో ఎక్కువ డబ్బును ఖాళీ చేయడానికి, జట్టులో మార్పులు తీసుకురావడానికి ఈ ఆటగాళ్లను వేలంలోకి పంపే అవకాశం ఉంది.
| ఆటగాడు | కారణం |
|---|---|
| డేవాన్ కాన్వే | మూడేళ్ల అనుబంధం తర్వాత ఈ న్యూజిలాండ్ బ్యాటర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. |
| విజయ్ శంకర్ | స్థిరమైన ప్రదర్శన కనబరచకపోవడం |
| రాహుల్ త్రిపాఠి | వేలంలోకి పంపి, వేరే ఆటగాడిని తీసుకోవడానికి వీలుగా.. |
| జేమీ ఓవర్టన్ | విదేశీ కోటాలో మార్పుల కోసం.. |
| కమలేష్ నాగర్‌కోటి | |
| గుర్జప్‌నీత్ సింగ్ | |
| రవిచంద్రన్ అశ్విన్ | రిటైర్ అయ్యాడు, కాబట్టి రిటెన్షన్‌కు అనర్హుడు. |
జడేజా, సామ్ కరన్ బదులుగా సంజు శాంసన్: రాజస్థాన్ రాయల్స్‌తో సంజు శాంసన్ ట్రేడ్‌కు సంబంధించి సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ట్రేడ్‌లో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, వారి నుంచి సంజు శాంసన్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
CSK పర్స్‌ను పెంచుకోవడానికి, టాప్-క్లాస్ ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయడానికి మార్కెట్‌లోకి వెళ్లాలని చూస్తోంది. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో పర్స్ పెరిగింది. దీంతో కామెరూన్ గ్రీన్ వంటి పెద్ద ఆటగాళ్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
గత మెగా వేలంలో సూపర్ కింగ్స్ రూ. 119.95 కోట్లు ఖర్చు చేయగా, చెన్నై వద్ద రూ. 0.05 కోట్లు మాత్రమే మిగిలాయి. సీఎస్కే నిర్మించిన 24 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది.
ఆండ్రీ సిద్ధార్థ్
ఆయుష్ మాత్రే
డెవాన్ కాన్వే
రాహుల్ త్రిపాఠి
షేక్ రషీద్
దీపక్ హుడా
డెవాల్డ్ బ్రెవిస్
జేమీ ఓవర్టన్
రచిన్ రవీంద్ర
రామకృష్ణ ఘోష్
రవీంద్ర జడేజా
సామ్ కుర్రాన్
శివం దుబే
విజయ్ శంకర్
ఎంఎస్ ధోని
ఉర్విల్ పటేల్
అన్షుల్ కాంబోజ్
కమలేష్ నాగర్కోటి
ఖలీల్ అహ్మద్
మథీష పతిరానా
ముఖేష్ చౌదరి
నాథన్ ఎల్లిస్
నూర్ అహ్మద్
శ్రేయాస్ గోపాల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..