టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు.. అసలు కారణం ఏంటంటే?

|

Sep 27, 2021 | 3:23 PM

Moeen Ali: ఈ ఆటగాడు చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, ఇటీవలి కాలంలో విఫలమవడంతో జట్టులోకి ఎంపిక కాలేకపోతున్నాడు. దీంతో..

టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు.. అసలు కారణం ఏంటంటే?
England Cricketer Moeen Ali
Follow us on

England Cricket Team: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈమేరకు వివరాలు వెల్లడించింది. టెస్ట్ క్రికెట్ నుంచి మొయిన్ అలీ తప్పుకుంటున్నట్లు గత రాత్రి వెలువడింది. అయితే, మొయిన్ అలీ తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాడని బోర్డు వెల్లడించింది. తన రిటైర్మెంట్ గురించి సమాచారం ఇస్తూ, ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మొయిన్ అలీ, తనకు 34 సంవత్సరాలు వచ్చాయని, వీలైనంత కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ చాలా గొప్పదని, అయితే ప్రస్తుతం ఈ ఫార్మాట్‌కు ఆడడం అంత కరెక్ట్ కాదని అనుకుంటున్నట్లు బోర్డుకు తెలిపాడు.

ఇంగ్లండ్ తరఫున 64 టెస్టులు ఆడిన 34 ఏళ్ల మొయిన్ అలీ.. టెస్టు జట్టుతో నిరంతరంగా ప్రయాణం చేశారు. 2014 లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మొయిన్, 111 ఇన్నింగ్స్‌లలో 28.29 సగటుతో 2914 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 36.66 సగటుతో మొత్తం 195 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదుసార్లు ఐదు వికెట్లు తీసి పలు రికార్డులు కూడా సాధించాడు.

2019 యాషెస్ సిరీస్ నుంచి టెస్ట్ క్రికెట్ ఆడలేదు. కానీ, ఇటీవల భారత్‌తో జరిగిన హోమ్ సిరీస్ కోసం టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే, నివేదికల ప్రకారం మాత్రం.. మొయిన్ అలీ ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉండటం ఇష్టపడడం లేదంట. యాషెస్ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు ఇంగ్లండ్ టీం ఈ ఏడాది చివర్లో వెళ్లాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన కరోనా ప్రోటోకాల్స్‌ చాలా కఠినంగా ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈసీబీతో యుద్ధం చేస్తున్నారు. కరోనా కారణంగా భారత్‌తో జరగాల్సిన ఐదవ టెస్టును రద్దు చేయడానికి ముందు అలీ 3000 టెస్ట్ పరుగులు, 200 వికెట్లను పూర్తి చేసిన 15 వ టెస్ట్ క్రికెటర్‌గా అవతరించాడు.

“టెస్ట్ క్రికెట్ చాలా గొప్పది. ఏ క్రికెటర్‌ అయినా ఇందులో రాణించాలని కోరుకుంటాడు. ఈ ఫార్మాట్ ఎంత నేర్పిస్తుంది. ఫాంలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. నేను టెస్ట్ క్రికెట్‌ని చాలా ఆస్వాదించాను. అయితే కొన్నిసార్లు ఒత్తిడి అధికంగా ఉండేది. ఇప్పటి వరకైతే నా టెస్ట్ కెరీర్ చాలా బాగుంది” అని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.

2017 లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓవల్ టెస్టులో మొయిన్ అలీ హ్యాట్రిక్ సాధించాడు. పదవీ విరమణ తర్వాత మాట్లాడుతూ, ‘టెస్ట్ జట్టు నుంచి తొలగించడం, మరలా కాంట్రాక్ట్ పొందకపోవడంతో 2019 లోనే నేను రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం ఫ్రాంచైజ్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

Also Read: SRH vs RR IPL 2021 Records: పోటీలో ఇరు జట్లు సమమే.. నేడు హోరాహోరీ పోరు గ్యారెంటీ.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

AB de Villiers: తండ్రి ఔటవడంతో కుర్చీని తన్నేసిన డివిలియర్స్ కొడుకు.. వైరల్‎గా మారిన వీడియో..