ఏకకాలంలో మూడు జట్లకు కోచింగ్‌ చేస్తున్న శ్రీలంక లెజండరీ బ్యాట్స్‌మెన్‌.. ఇది ఎలా జరిగిందంటే..?

|

Dec 14, 2021 | 7:44 AM

Cricket News: శ్రీలంక లెజండరీ బ్యాట్స్‌మెన్, మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు జట్లకు కోచ్‌గా మారాడు.

ఏకకాలంలో మూడు జట్లకు కోచింగ్‌ చేస్తున్న శ్రీలంక లెజండరీ బ్యాట్స్‌మెన్‌.. ఇది ఎలా జరిగిందంటే..?
Mahela
Follow us on

Cricket News: శ్రీలంక లెజండరీ బ్యాట్స్‌మెన్, మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు జట్లకు కోచ్‌గా మారాడు. శ్రీలంక పురుషుల సీనియర్ జట్టుకు కన్సల్టింగ్ కోచ్‌గా ఉన్నాడు. అదేవిధంగా అండర్-19, శ్రీలంక A జట్లతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. ఈ మూడు జట్లకు కన్సల్టింగ్ కోచ్‌గా జయవర్ధనే ఒప్పందం వచ్చే ఏడాది మాత్రమే. మూడు జట్లతో జయవర్ధనే పదవీకాలం జనవరి 1, 2022 నుంచి ప్రారంభమవుతుందని శ్రీలంక క్రికెట్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ఈ సమయంలో అతను సీనియర్ జట్టుకు సంబంధించిన అన్ని క్రికెట్ సంబంధిత విషయాలకు బాధ్యత వహిస్తాడు. ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్ బృందానికి ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. ఇప్పటికే జయవర్దనే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక క్రికెట్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో అతడితో సంప్రదించిన తర్వాత కన్సల్టెంట్ కోచ్ పాత్రను కేటాయించింది. ఈ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా మాట్లాడుతూ.. ‘మహేలా పెద్ద పాత్రలో జాతీయ జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. 2022లో శ్రీలంక చాలా బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది ఈ దిశలో కన్సల్టెంట్ కోచ్‌గా పగ్గాలు చేపట్టడం చాలా ముఖ్యం’ అన్నాడు.

T20 WC 2021లో సలహాదారుగా..
ICC T20 ప్రపంచ కప్ 2021 సమయంలో కూడా జయవర్దనే శ్రీలంక జట్టుకు సలహాదారుగా వ్యవహరించాడు. ఇప్పుడు అండర్-19, ‘A’ జట్టు కూడా కోచ్‌గా మారాడు. ఈ సందర్భంగా జయవర్దనే మాట్లాడుతూ..’నాకు శ్రీలంక క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. పరస్పర సమన్వయంతో భవిష్యత్తులో స్థిరమైన విజయాలు సాధించగలమని నమ్ముతున్నాను. మా దృష్టి దానిపైనే ఉంటుంది’ అని చెప్పాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం జయవర్ధనే జట్టును సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ, అతను పురుషుల సీనియర్ జట్టుతో పాటు పురుషుల అండర్ 19 జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా ఉండటం వల్ల ఏమైనా మార్పులు జరుగుతాయా లేదా అనేది వేచిచూడాలి.

Singareni: అంతా నిబంధనల ప్రకారమే.. తెలంగాణ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై కేంద్ర సర్కార్ కీలక ప్రకటన

IND Vs SA: రహానె, పంత్‎కు చిట్కాలు చెప్పిన వినోద్ కాంబ్లీ.. అమ్మమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకున్న మయాంక్

Nagarjuna : వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటామన్న కింగ్ నాగార్జున..