6 బంతుల్లో 30 పరుగులు.. తుఫాన్ అర్ధ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఎవరో తెలుసా.!

|

May 18, 2022 | 12:22 PM

లో-స్కోరింగ్ గేమ్‌లో జింబాబ్వే కెప్టెన్ వీరోచిత అర్ధ సెంచరీతో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం..

6 బంతుల్లో 30 పరుగులు.. తుఫాన్ అర్ధ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఎవరో తెలుసా.!
Zimbabwe
Follow us on

టీ20 మ్యాచ్‌ అంటేనే పరుగుల వరద పారుతుంది. అయితే ఇక్కడ మాత్రం అందుకు విరుద్దంగా జరిగింది. బులవాయో మైదానంలో జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన లో-స్కోరింగ్ గేమ్‌లో జింబాబ్వే కెప్టెన్ వీరోచిత అర్ధ సెంచరీతో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ రెండు జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతుండగా.. అందులో మొదటి మ్యాచ్ మే 17న జరిగింది, ఇందులో జింబాబ్వే 7 పరుగుల తేడాతో నమీబియాను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో నమీబియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పరుగుల వేటలో మొదట నమీబియా ఆదరగొట్టింది. ఆ జట్టు ఓపెనర్స్ ఇద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ దేవన్ కాక్ 43 బంతుల్లో అత్యధికంగా 66 పరుగులు చేయగా.. అదే సమయంలో రెండో ఓపెనర్ క్రెయిగ్ విలియమ్స్ 25 పరుగులు చేశాడు. వీరిరువురూ తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో నమీబియా జట్టు లక్ష్యచేధనలో చతికిలబడింది. చివరికి ఓటమిని చవి చూసింది.

ఇవి కూడా చదవండి

6 బంతుల్లో 30 పరుగులు..

బులవాయో మైదానంలో జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఆ జట్టు స్కోర్‌ను 150 పరుగులు దాటించే క్రమంలో కీలక పాత్ర పోషించాడు. 39 బంతులు ఎదుర్కొన్న ఇర్విన్ 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. అంటే బౌండరీల రూపంలో 6 బంతుల్లో 30 పరుగులు చేశాడన్న మాట. అటు సికిందర్ రాజా(37) కూడా కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లకు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కాగా, ఈ విజయంతో జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉండగా.. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 19న బులవాయో మైదానంలో జరగనుంది.