Team India: అరె పిచ్చోడా.! గంభీర్ ఉన్నంతకాలం టీమిండియాలోకి నో ఎంట్రీ.. గల్లీ క్రికెట్ ఆడుకో

India vs South Africa: దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న తోపు ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేసి, ఫామ్‌లో లేని గిల్, జితేష్‌లను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పక్షపాతంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Team India: అరె పిచ్చోడా.! గంభీర్ ఉన్నంతకాలం టీమిండియాలోకి నో ఎంట్రీ.. గల్లీ క్రికెట్ ఆడుకో
Ind Vs Sa T20i Series

Updated on: Dec 11, 2025 | 2:20 PM

India vs South Africa: భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, జట్టు విజయాల కంటే ఒక స్టార్ ప్లేయర్‌ను వరుసగా పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ ఆ ఆటగాడిని ప్లేయింగ్ XIలో తీసుకోకపోవడంతో, కోచ్ గౌతమ్ గంభీర్‌కు అతనిపై ఏదైనా పాత పగ ఉందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆటగాడు మరెవరో కాదు, కేరళ స్టార్ సంజు శాంసన్.

సంజుపై గంభీర్ శీతకన్ను?..

వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. సంజు ఓపెనర్‌గా రాణించినా, ఆ స్థానంలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్‌కు అవకాశాలిస్తున్నారు. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడించిన వెంటనే సంజును పక్కన పెట్టడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Team India: టీ20ల్లో తోపు బౌలర్.. కట్‌చేస్తే.. ప్రతీసారి హ్యాండిస్తోన్న గంభీర్.. ఎవరంటే?

ఇవి కూడా చదవండి

సంజు vs గిల్ & జితేష్: కోచ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై గణాంకాలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

శుభ్‌మన్ గిల్: టీ20ల్లో గిల్ ఈ ఏడాది (2025) 13 ఇన్నింగ్స్‌లు ఆడినా ఒక్క అర్ధశతకం (50) కూడా చేయలేకపోయాడు. అయినప్పటికీ అతనికి వరుస అవకాశాలు ఇస్తున్నారు.

జితేష్ శర్మ: వికెట్ కీపర్‌గా ఎంపికైన జితేష్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

సంజు శాంసన్: మరోవైపు సంజు దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)లో అదరగొట్టాడు. 6 ఇన్నింగ్స్‌లలో 58.25 సగటుతో 233 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ కూడా 137కి పైగా ఉంది.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టలేరు.. పరుగులు రాబట్టలేరు.. టీమిండియాకు ‘భారం’గా ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు..!

దేశవాళీలో ఆడినా ఫలితం లేదా?..

దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న సంజును బెంచ్‌కే పరిమితం చేసి, ఫామ్‌లో లేని గిల్, జితేష్‌లను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పక్షపాతంగా ఉన్నాయని, సంజుపై ఏదో తెలియని వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నట్లు అనిపిస్తోందని ఆ కథనం పేర్కొంది.

అద్భుతమైన ప్రతిభ, ఫామ్ ఉన్నప్పటికీ సంజు శాంసన్‌కు అన్యాయం జరుగుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే మ్యాచ్‌లలోనైనా గంభీర్ మనసు మార్చుకుని సంజుకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.