Ausis Cricket Team: ఐపీఎల్ వాయిదా పడటం.. భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన ప్రయాణాలు రద్దైన సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లంతా మాల్దీవుల్లో సెటిల్ అయ్యారు. దొరికన సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రోజూ సెలబ్రేషన్స్‌తో మాల్దీవుల్లో తెగ సందడి చేస్తున్నారట. అయితే, తాజాగా మాల్దీవులోని ఓ బార్‌లో ఆసీస్ ఆటగాళ్లు గొడవపడిన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందట. అంతేకాదు.. వీరిద్దరూ ఒకరిమీద మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నట్లు తెలుస్తోంది.
డేవిడ్ వార్నర్, మైఖేల్ స్లేటర్‌లు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రచురితం అయ్యాయి. వార్నర్, మైఖేల్ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయినా.. ఓ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదయ్యిందని, ఆ గొడవ కాస్తా భౌతిక దాడులకు పాల్పడే వరకూ వెళ్లిందట. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న ఈ వార్తపై తాజాగా వార్నర్, మైఖేల్‌లు స్పందించారు. తమ మధ్య ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదని తేల్చి చెప్పారు. అవన్నీ వట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. వార్నర్, తాను మంచి స్నేహితులమని.. తమ మధ్య గొడవ జరిగే అవకాశమే లేదని మైఖేల్ స్పష్టం చేశాడు.
Also read:
Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..
NASA Helicopter: మరో ఘనత సాధించిన నాసా.. తొలిసారి అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..