ఇంగ్లండ్ దేశవాళి క్రికెట్‌లో భాగంగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ లీగ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం (జూన్ 02) హాంప్‌షైర్, కెంట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెంట్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రిస్ వుడ్ 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత హాంప్ షైర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తద్వారా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే కెంట్ ఇన్నింగ్స్ చివర్లో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ వేసిన ఫుల్ లెంత్ డెలవరీని కెంట్ బ్యాటర్ ఓయి ఎవిసన్ స్ట్రైయిట్‌గా బలమైన షాట్ ఆడాడు. దీంతో బంతి డైరెక్టుగా వచ్చి నాన్‌స్ట్రైకర్‌లో ఉండి పరుగు కోసం ప్రయత్నిస్తోన్న మాథ్యూ పార్కిన్సన్‌కు బలంగా తాకింది. దీంతో క్రీజ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు మాథ్యూ. అదే సమయంలో అతనికి తగిలిన బంతి అక్కడే బౌలర్ క్రిస్ వుడ్ చేతికి దొరికింది. సాధారణంగా ఇలాంటి అవకాశం దొరికితే బౌలర్లు వెంటనే వికెట్లను పడగొట్టి రనౌట్ చేస్తారు.
కానీ క్రిస్ వుడ్ మాత్రం అలా చేయలేదు. నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటుతూ యాథావిధిగా నెక్ట్స్ బాల్ వేసేందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడ పార్కిన్సన్‌ను ఈజీగా రనౌట్ చేసే అవకాశం క్రిస్ వుడ్‌కు ఉంది. కానీ, అతనికి దెబ్బ తగిలి పడిపోయి క్రీజులోనే విలవిల్లాడిపోవడంతో వుడ్ రనౌట్ చేయకుండా క్రీడా స్ఫూర్తి చాటాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్రిస్ వుడ్ క్రీడాస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ ఇదేనంటూ ఈ బౌలర్ ను పొగిడిస్తున్నారు.
Impeccable sportsmanship 👏
Matt Parkinson is struck by the ball, and Chris Wood chooses not to run him out 🫡 pic.twitter.com/RijvNEpqWi
— Vitality Blast (@VitalityBlast) June 2, 2024
Sportsmanship at its best! Chris Wood chooses not to run out injured batter at non-striker’s end #vitalityblast #t20cricket #chriswood pic.twitter.com/FjLJrIXD0H
— SportsTiger (@The_SportsTiger) June 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..