ఈ ఫొటోలో ఒకే డ్రెస్ ధరించి పోజులిస్తోన్న ఈ చిన్నారులు ఇప్పుడు స్టార్ క్రికెటర్లుగా ఎదిగిపోయారు. ఫార్మాట్ ఏదైనా ఒకరికొకరు పోటీపడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్నారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పరుగుల మీద పరుగులు, సెంచరీలు కొట్టేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ వీరికి వీరే సాటి. అందుకే సోషల్ మీడియాలోనూ వీరికి భారీ ఫాలోయింగ్ ఉంది. కేవలం ఆటగాడిగానే కాదు కెప్టెన్లుగానే తమ జట్లకు మరుపురాని విజయాలు అందించిన ఈ స్టార్ క్రికెటర్లు ఎవరో గుర్తుపట్టారా మరి.
How come, both babar & kohli are wearing the same shirts ?
ఇవి కూడా చదవండిThat bowl cut ? pic.twitter.com/85PYXR6tyA
— Masab Aqeel Janjua (@MasabAqeelreal) September 27, 2022
వారెవరో కాదు టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ స్టార్ క్రికెటర్ల ఫొటోలు తరచూ వైరలవుతుంటాయి. అభిమానులు కూడా వీరిని పోల్చుతూ తరచూ నెట్టింట్లో ఫొటోలు షేర్ చేస్తుంటారు. అలా ఒక ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో విశేషమేమిటంటే.. ఈ ఇద్దరు క్రికెటర్లు తమ బాల్యంలో ఒకే తరహా డ్రస్సులు ధరించి ఉండడం. ఈ ఫొటోలో కోహ్లి లేత గోధుమరంగు, బూడిద రంగు కలగలిపిన చొక్కా ధరించి ఉండగా, బాబర్ కూడా దాదాపు అదే కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చాడు. అన్నట్లు వీరి హెయిర్ స్టైల్స్ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఈ ఫోటోను చూసిన అభిమానులు తమ ప్రేమను ఆపుకోలేకపోతున్నారు. లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తూ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..