CSK vs KKR, IPL 2021: అబుదాబిలో నేడు ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో భాగంగా 38వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
కోల్‌కతా ఓపెనర్లు అన్ని మ్యాచుల్లో మంచి ఓపెనింగ్ సెట్ చేసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే, ధోనీ సేన మాత్రం కేకేఆర్ ఓపెనర్లు శుభ్మన్ గిల్(9), వెంకటేష్ అయ్యర్ (18) ఎక్కువ సేపు క్రీజులో ఉంచకుండా త్వరగానే పెవిలియన్ చేర్చారు. దీంతో ఈ మ్యాచులో చెన్నై సగం విజయం సాధించినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే శుభ్మన్ గిల్ అనవసర పరుగుకు ప్రయత్నించి రాయుడు వేసిన అద్భుత త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వెంకటేష్ అయ్యర్ 5.1 ఓవర్లో శార్దుల్ తొలి ఓవర్‌లోనే చిక్కి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి(45 పరుగులు, 33 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. అర్థ సెంచరీ చేయకుండానే జడేజా బౌలింగ్‌లో టీం స్కోర్ 89 పరగుల వద్ధ పెవిలియన్ చేరాడు. ఈ మధ్యలో కెప్టెన్ మోర్గాన్ (8) మరోసారి నిరాశ పరిచాడు.
అనంతరం నితీష్ రాణా* (37 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), అండ్రూ రస్సెల్(20) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి పరుగులు సాధించి, కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కానీ, శార్దుల్ మరోసారి కోల్‌కతాను కీలక సమయంలో దెబ్బతీసి బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ 236 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేశాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో శార్దుల్, హజల్ వుడ్ తలో 2 వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
Innings Break!
A great start and finish for #KKR as they post a total of 171/6 on the board.#CSK chase coming up shortly.
Scorecard – https://t.co/l5Nq3WffBt #CSKvKKR #VIVOIPL pic.twitter.com/XU84yD122M
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Also Read: AUSW vs INDW: ఆస్ట్రేలియా వరుస విజయాలకు బ్రేకులు వేసిన భారత్.. చివరి వన్డేలో ఘన విజయం