AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai super kings: తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయిన ధోని సేనకు మరో షాక్‌.. ఇలా అయ్యిందేంటి..

Chennai super kings: ఐపీఎల్‌ 2021లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ..

Chennai super kings: తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయిన ధోని సేనకు మరో షాక్‌.. ఇలా అయ్యిందేంటి..
Ms Dhoni
Narender Vaitla
|

Updated on: Apr 11, 2021 | 2:00 PM

Share

Dhoni Fined For Slow Over Rate: ఐపీఎల్‌ 2021లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ ముందు ఉంచినా ఢిల్లీ జట్టు అవలీలగా లక్ష్యం చేధించింది. దీంతో టోర్నీలో ఢిల్లీ శుభారంభం చేయగా చెన్నై ఓటిమితో టోర్నీ ప్రారంభించాల్సి వచ్చింది. ఇలా ఓ వైపు ఓటమితో బాధపడుతుంటే ధోని జట్టుకు మరో షాక్‌ తగిలింది. వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ధోనికి భారీ జరిమాన విధించారు. ‘శనివారం రాత్రి వాంకడేలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే టీమ్‌ స్లో ఓవర్‌ రేట్‌ను కనబరించింది. ఈ కారణంగానే ధోనికి రూ.12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్‌ మీడియాకు ఇచ్చిన వివరణలో వెల్లడించింది. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం పట్ల ధోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం అవార్డుల కార్యక్రమంలో మ్యాచ్‌లో విఫలం చెందడం పట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభం కావడంతో ప్రత్యర్థి జట్టు మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ పిచ్‌ చాలా పేలవంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ కష్టంగా మారింది. ఇక్కడ మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పిచ్‌పై డ్యూ (తేమ) కనబడింది. అది తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుంది. పిచ్‌పై మంచు ఉంటే అది ఛేజింగ్‌ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఎప్పుడైనా తేమ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. ఇంకా 15-20 పరుగులు చేస్తే బాగుండేది. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్‌ ఒక గుణపాఠం’ అని చెప్పుకొచ్చాడు ధోని. ఇక ఢిల్లీ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేశారు. ఈ తరహా పిచ్‌పై ఏ బంతులు వేయాలో అవే వేసి విజయవంతమయ్యారు. మా ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బంతులు నిజంగా అద్భుతం’ అని ధోని పేర్కొన్నాడు.

Also Read: చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు

Rahul Dravid: నడిరోడ్డుపై రాహుల్ ద్రావిడ్ హల్‌చల్.. క్రికెట్‌ బ్యాట్‌తో కారు ధ్వంసం.. ‘గాంధీ నగర్‌కా గూండా’నంటూ..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..