ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బౌలర్.. బౌన్సర్ దెబ్బకు మరణం అంచులకు చేరి, కెరీర్ ముగించిన భారత కెప్టెన్..

|

Dec 14, 2022 | 8:50 AM

On This Day Cricket: వెస్టిండీస్‌కు చెందిన ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ బౌన్సర్‌ను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. లిస్టులో ఓ భారత ప్లేయర్‌ చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు.

ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బౌలర్.. బౌన్సర్ దెబ్బకు మరణం అంచులకు చేరి, కెరీర్ ముగించిన భారత కెప్టెన్..
Charlie Griffith
Follow us on

Charlie Griffith Birthday: నారీ కాంట్రాక్టర్… భారత జట్టు పగ్గాలు చేపట్టిన ఆటగాడు. 31 టెస్టు మ్యాచ్‌ల్లో భారత జెండాను ఎగురవేశాడు. ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అలాగే 1959లో లార్డ్స్‌లో 2 పక్కటెముకలు విరిగిపోయినా.. ఇంగ్లీష్ బౌలర్లను చితక్కొట్టి 81 పరుగులతో డేరింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కాంట్రాక్టర్ తన కెరీర్‌లో చాలాసార్లు మైదానంలో అద్భుతాలు చేశాడు. అతని కెరీర్‌లో మరిన్ని అద్భుతాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దురదృష్టం 1962లో అతనికి వెస్టిండీస్ పర్యటన రూపంలో వచ్చింది. అతని కెరీర్‌లో చివరి పర్యటనగా మార్చింది.

ఈ పర్యటనలో, కరేబియన్ బౌలర్ అతన్ని మృత్యువుకు పరిచయం చేశాడు. ఈ భారత లెజెండ్ ప్లేయర్ మరణం అంచుల దాకా వెళ్లి బయటకు వచ్చాడు. దాంతో అతని కెరీర్ ముగిసింది. నారీ కాంట్రాక్టర్‌ను చావుకు పరిచయం చేసిన బౌలర్ చార్లీ గ్రిఫిత్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్. గ్రిఫిత్ 84వ పుట్టినరోజు నేడు.

గ్రిఫిత్ ప్రమాదకర బౌన్సర్‌కు బలైన భారత ప్లేయర్..

1938 డిసెంబర్ 14న జన్మించిన గ్రిఫిత్, 1961-1962లో వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న నారీ కాంట్రాక్టర్‌ను తన బౌన్సర్‌లతో రక్తమోడించాడు. బార్బడోస్ తరపున ఆడుతున్న గ్రిఫిత్ వేసిన బంతి భారత కెప్టెన్ తల వెనుకకు తగిలింది. ఆ తర్వాత, భారత కెప్టెన్‌కు 2 శస్త్రచికిత్సలు జరిగాయి. కరీబియన్ కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్ కూడా రక్తదానం చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

స్పిన్నర్ నుంచి ఫాస్ట్ బౌలర్‌గా..

వైద్యులు కాంట్రాక్టర్ జీవితాన్ని కాపాడారు. కానీ, అతని అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసింది. ఆ తరువాత, గ్రిఫిత్ ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అయితే గ్రిఫిత్ తన కెరీర్‌ను స్పిన్ బౌలర్‌గా ప్రారంభించాడని కొంతమందికి మాత్రమే తెలుసు. ఒక మ్యాచ్ తర్వాత అతను వేగంగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తన ఫాస్ట్ బంతులతో క్రికెట్ ప్రపంచంలో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత అతను బార్బడోస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

వెస్టిండీస్ తరపున గ్రిఫిత్ 28 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 94 వికెట్లు పడగొట్టాడు. 36 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతను 28 టెస్టుల్లో 530 పరుగులు చేశాడు. అందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..