ICC Board Meet: బర్మింగ్‌హామ్‌లో ఐసీసీ బోర్డ్ మీటింగ్.. ఐపీఎల్ విండోపై కీలక చర్చ.. నో అంటోన్న పాక్..

|

Jul 02, 2022 | 5:34 PM

ఐసీసీ బోర్డు సమావేశంలో ఐపీఎల్ విండోకు సంబంధించి బీసీసీఐ ఇతర బోర్డులతో చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. వచ్చే ఎఫ్‌టీపీ నుంచి ఐపీఎల్‌కు రెండున్నర నెలల సమయం ఉంటుందని జైషా ఇప్పటికే స్పష్టం చేశారు.

ICC Board Meet: బర్మింగ్‌హామ్‌లో ఐసీసీ బోర్డ్ మీటింగ్.. ఐపీఎల్ విండోపై కీలక చర్చ.. నో అంటోన్న పాక్..
ICC Board Meet
Follow us on

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డు సభ్యుల ప్రధాన సమావేశం జులై 25, 26 తేదీలలో బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ప్రపంచ క్రికెట్‌లో జరగబోయే పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమాచారం ప్రకారం, ఈ సమావేశం కామన్వెల్త్ క్రీడల సందర్భంగా జరుగుతుందని తెలుస్తోంది. 2024-31 సీజన్ కోసం ICC ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఐసీసీ చైర్మన్ ఎన్నికపై కూడా..

ఈ భేటీలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఐసీసీ చైర్మన్ ఎన్నికపై ఇందులో చర్చ జరగనుంది. ఐసీసీ చైర్మన్ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై కూడా సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కూడా ఐపీఎల్ విండోకు సంబంధించి అన్ని విదేశీ బోర్డులతో చర్చలు జరుపుతుందని కూడా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వచ్చే ఎఫ్‌టీపీ నుంచి ఐపీఎల్‌కు రెండున్నర నెలల సమయం ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పాటు పీసీబీ ప్రతిపాదించిన మూడు దేశాల టోర్నీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కొంతకాలంగా పట్టుబడుతున్నారు.

ఐపీఎల్ విండోపై జైషా ప్రకటన..

ఐసీసీ తదుపరి ఎఫ్‌టీపీకి ఐపీఎల్‌కు రెండున్నర నెలల సమయం ఉంటుందని జైషా గత నెలలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. 2027లో ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు ఆడనున్నామంటూ షా ప్రకటించాడు. IPL తదుపరి ICC FTP క్యాలెండర్ నుంచి రెండున్నర నెలల అధికారిక విండోను కలిగి ఉంటుందని, తద్వారా అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లందరూ ఇందులో పాల్గొనవచ్చని అన్నారు. వివిధ బోర్డులతో పాటు మేం ఐసీసీతో కూడా దీనిపై చర్చించాం’ అని చెప్పుకొచ్చాడు.