AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియాలో ‘గజిని’ ఎవరు..? రోహిత్ శర్మ ఆన్సర్ ఏంటో తెలిస్తే నవ్వుకోవాల్సిందే..

Team India Ghajini Cricketer: టీమిండియా గురించే కాదు.. భారత క్రికెటర్ల గురించి కూడా పలు ఆసక్తికర కథనాలు తరచుగా వినిపిస్తుంటాయి. భారత జట్టులోని ఆటగాళ్లందరూ మైదానంలో ఎంత సీరియస్‌గా కనిపిస్తారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా బయట కనిపిస్తుంటారు. భారత జట్టు కింగ్ కోహ్లీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అతను తన తోటి ఆటగాళ్లను అనుకరిస్తూ కనిపిస్తుంటాడు.

Team India: టీమిండియాలో 'గజిని' ఎవరు..? రోహిత్ శర్మ ఆన్సర్ ఏంటో తెలిస్తే నవ్వుకోవాల్సిందే..
Rohit Sharma Kapil Sharma S
Venkata Chari
|

Updated on: Sep 30, 2024 | 4:28 PM

Share

Team India Ghajini Cricketer: టీమిండియా గురించే కాదు.. భారత క్రికెటర్ల గురించి కూడా పలు ఆసక్తికర కథనాలు తరచుగా వినిపిస్తుంటాయి. భారత జట్టులోని ఆటగాళ్లందరూ మైదానంలో ఎంత సీరియస్‌గా కనిపిస్తారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా బయట కనిపిస్తుంటారు. భారత జట్టు కింగ్ కోహ్లీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అతను తన తోటి ఆటగాళ్లను అనుకరిస్తూ కనిపిస్తుంటాడు.

మైదానంలో ఫోర్లు, సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం వెలుపల చాలా కూల్‌గా కనిపిస్తుంటాడు. రోహిత్ శర్మ సరదాగా కనిపించిన చాలా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా ఆటగాళ్లు కొందరు పాల్గొన్నారు. ఇందులో రోహిత్ శర్మ చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. టీమిండియాలో గజినీ ప్లేయర్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

టీమిండియాలో గజినీ ఎవరు?

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండో సీజన్ ప్రారంభమైంది. దీని రెండు ఎపిసోడ్‌లు కూడా ప్రసారం అయ్యాయి. ఇప్పుడు ఈ సీజన్ మూడవ ఎపిసోడ్ అక్టోబర్ 5 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు, టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు కూడా ఈ షోకు విచ్చేయనున్నారు. మూడో ఎపిసోడ్ ప్రివ్యూ కూడా విడుదలైంది. ఇందులో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024లో భాగమైన క్రికెటర్లు కనిపిస్తారు.

షో సందర్భంగా క్రికెటర్లందరికీ ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇంతలో, షో న్యాయనిర్ణేత అర్చన పురాణ్ సింగ్ టీమ్ ఇండియా గజినీ ఎవరు అంటూ ఓ ప్రశ్న అడిగారు. దీనిపై రోహిత్ శర్మ చిరునవ్వుతో బదులిస్తూ ఇది నా అసలు టైటిల్, నేనే గజిని, నేను తరచుగా విషయాలు మరచిపోతుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇది విని అక్కడ ఉన్నవారందరూ నవ్వడం మొదలు పెట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..