Cameron Green: ఆసీస్‌కు షాక్‌.. గాయంతో మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

| Edited By: Janardhan Veluru

Sep 28, 2024 | 12:29 PM

ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ వెన్నులో గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి రెండు వన్డే మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. దీంతో నెక్ట్స్ భారత్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్ కోసం గ్రీన్‌ ఆడడం సందేహంగా మారింది.

Cameron Green: ఆసీస్‌కు షాక్‌.. గాయంతో మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
Cameron Green
Follow us on

ఈ ఏడాది నవంబర్‌‌లో స్వదేశంలో భారత్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఆసీస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ బోర్డర్ గవాస్వర్ ట్రోపీలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ వెన్నులో గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి రెండు వన్డే మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. దీంతో నెక్ట్స్ భారత్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్ కోసం గ్రీన్‌ ఆడడం సందేహంగా మారింది. గ్రీన్ గాయం నుంచి కొలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియాలంటే ఆసీస్‌‌కి చేరుకొని పరీక్షలు చేసిన తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది. ఆసీస్‌లో ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్, కామెరూన్ ఆందుబాటలో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ స్టాంగ్‌గా ఉండడమే గాక పేసర్లపై భారం తగ్గుతుంది. కామెరాన్ గ్రీన్ తన కెరీర్‌ను బౌలింగ్‌తో ప్రారంభించడంతో.. తన అనుభవం ఉపయోగం పడుతుందిని ఆసీస్ బోర్డు భావిస్తుంది. గత రెండు బోర్డర్ గవాస్వర్ ట్రోపీలో ఓటమి పాలవ్వడంతో ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాల్సిందేనని ఆసీస్ ఇప్పటి నుంచే సన్నాహలు ప్రారంభించింది.

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన 4వ వన్డేలో ఇంగ్లాండ్ 186 భారీ పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్స్‌లో అయిదు వికెట్లు మాత్రమే కోల్పోయి 312 పరుగులు చేసింది. ఓపెనింగ్ వచ్చిన డకెట్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే లివింగ్ స్టన్ స్టార్క్ బౌలింగ్‌లో చితకబాదాడు. 62 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ మార్ష్, మాక్స్‌వెల్, హేజిల్‌వుడ్ ఒక్కొక్కరు ఒక్క వికెట్ తీశారు. జంపా రెండు వికెట్లు తీశాడు.

స్వదేశంలో నవంబర్ 22నుంచి ప్రారంభమయ్యే ఆసీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో బారత్ విజయం సాధించాలంటే భారత్ స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, బూమ్రాలు చాలా కీలకం. వీళ్లు ఫామ్‌లో ఉంటే టెస్ట్ సిరీస్ అలవోకంగా గెలుచుకొవచ్చిని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2016 సంవత్సరం నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు తిరుగులేదనే చెప్పాలి. వేదిక ఏదైనా విజయం భారత్‌దే.. భారత్ ప్లేయర్‌లు గాయలబారిన పడకుండా ఉంటే ఈసారి కూడా కప్‌ మనేమే కొట్టేస్తామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోడ్డు ప్రమాదం నుంచి కొలుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభపరిణామం. యశస్వీ జైస్వాల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉండడం టీం ఇండియాకు సానుకులాంశం.