Big Bash League: 4 బంతుల్లో 4 వికెట్లు .. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆసీస్ స్పిన్నర్ ..

| Edited By: Ravi Kiran

Jan 20, 2022 | 7:01 AM

టీ- 20 లంటే బ్యాటర్లదే హవా అనుకుంటారు చాలామంది. అందుకే తగ్గట్లే ఈ పొట్టి క్రికెట్ లో బ్యాటింగ్ పరంగా ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి.  అయితే కచ్చితత్వంతో బంతులు వేస్తే  బౌలర్లు కూడా

Big Bash League: 4 బంతుల్లో 4 వికెట్లు .. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన  ఆసీస్ స్పిన్నర్ ..
Follow us on

టీ- 20 లంటే బ్యాటర్లదే హవా అనుకుంటారు చాలామంది. అందుకే తగ్గట్లే ఈ పొట్టి క్రికెట్ లో బ్యాటింగ్ పరంగా ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి.  అయితే కచ్చితత్వంతో బంతులు వేస్తే  బౌలర్లు కూడా  టీ- 20లో సత్తాచాటవచ్చని ఆస్ట్రేలియా స్పిన్నర్ క్యామెరూన్ బాయ్స్ మరోసారి నిరూపించాడు.  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ రెనిగెడ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆటగాడు బుధవారం అరుదైన ఫీట్ అందుకున్నాడు. సిడ్నీతో జరిగిన మ్యాచ్ లో వరుసగా  4 బంతుల్లో  4 వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. క్రికెట్ లో వరుసగా  మూడు బంతుల్లో మూడు  వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అని, అదేవిధంగా వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు నేల కూల్చితే డబుల్ హ్యాట్రిక్ గా పరిగణిస్తారు. అలా క్యామెరూన్ బాయ్స్ తాజా మ్యాచ్ లో డబుల్ హ్యాట్రిక్ తో సహా మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు.

కాగా గతేడాది యూఏఈలో జరిగిన టీ- 20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుమందు శ్రీలంక స్పీడ్ స్టర్ లసిత్ మలింగ కూడా డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా క్యామెరూన్ బాయ్స్ కూడా ఈ ఫీట్ ను అందుకున్నాడు. తద్వారా టీ -20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా రికార్డుల కెక్కాడు. అతను వరుస బంతుల్లో అలెక్స్ హేల్స్, జేసన్ సంఘా, అలెక్స్ రాస్,  డేనియల్ సామ్స్ ను ఔట్ చేశాడు. అయితే క్యామెరూన్ మొత్తం 5 వికెట్లు పడగొట్టినా సిడ్నీ జట్టు చేతిలో మెల్ బోర్న్ రెనిగెడ్స్ కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది.  లక్ష్య ఛేదనలో  మెల్ బోర్న్ రెనిగెడ్స్ 169 పరుగులకే మాత్రమే పరిమితమైంది. దీంతో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ల్లో టాప్-10 బౌలర్లు వీరే..!

Bedroom Vastu Tips: ఈ వాస్తు దోషాలు మీకు నిద్ర లేకుండా చేస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..