Brett Lee And Chris Gayle Video: వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మైదానం వెలుపల కూడా చాలా చురుకుగా ఉంటాడు. ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన గేల్.. తరచుగా నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ సీనియర్ ప్లేయర్.. తన డ్యాన్స్‌కు చాలా ప్రసిద్ధి చెందాడు. అయితే, తాజాగా ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీతో కలిసి హల్ చల్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. బ్రెట్‌లీ గిటార్ వాయిస్తుంటే.. క్రిస్ గేల్ పాడుతున్న వీడియోను అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. IPL 2023లో భాగంగా వీరిద్దరూ భారతదేశంలో ఉన్నారు.
ఈ వీడియోను క్రిస్ గేల్, బ్రెట్ లీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో బ్రెట్ లీ గిటార్ వాయిస్తుండగా, క్రిస్ గేల్ ఆ ట్యూన్‌పై పాడుతున్నట్లు చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, “గేల్, లీ కొలాబ్రేషన్” అంటూ క్యాప్షన్‌లో అందించారు.
వీరిద్దరి వీడియోపై చాలా మంది భారతీయులు కామెంట్స్ చేశారు. ఇందులో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయని అదితి సింగ్ శర్మ కూడా ఉన్నారు. కపిల్ శర్మ కామెంట్ చేస్తూ, ‘అద్భుతమైనది బ్రో’ అంటూ తన స్పందనను పంచుకున్నారు. అదితి సింగ్ శర్మ కామెంట్ చేస్తూ.. ఈ పాటను గేల్, బ్రెట్ లీ అధికారికంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూజర్లు కామెంట్ చేస్తూ.. “గేల్ భాయ్ ఎల్లప్పుడూ మూడ్‌లో ఉంటారు” అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..