క్రికెట్ టీమ్‌లకు సాధారణంగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లే నాయకత్వం వహిస్తారు. చాలా అరుదుగా మాత్రమే బౌలర్లు ఆ బాధ్యతను స్వీకరిస్తారు. అయితే ఈ నెలలో ప్రారంభమవబోతున్న ఓ టోర్నమెంట్‌లో బౌలర్లే తమ దళాలను ముందుకు నడిపిస్తున్నారు. ఈ నెల 20 న ప్రారంభమయ్యే భారత ‘సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ’లో బౌలర్లే సారథ్య బాధ్యతలను చేపట్టి వారి వారి టీమ్‌లను ముందుకు నడిపించబోతున్నారు. భారత మహిళా క్రికెటర్లు మాత్రమే పాల్గొనే ఈ దేశీవాళి టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు జట్లు పోటీపడుతుండగా..మూడు జట్లకు నాయకత్వం బౌలర్లే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వారిలో లెఫ్టార్మ్ స్పిన్నర్ దీప్తి శర్మ ఇండియా బి టీమ్ కెప్టెన్‌గా, పేసర్ పూజా వస్త్రాకర్ ఇండియా సి కోసం, ఆఫ్ స్పిన్నర్ స్నేహ రాణా ఇండియా డి జట్టుకు సారథ్య పగ్గాలు పట్టారు. పూనమ్ యాదవ్( ఇండియా ఏ) మాత్రమే నాలుగు జట్లలో ఏకైక బ్యాట్స్‌వుమెన్ కెప్టెన్‌గా ఉన్నారు.
నవంబర్ 20న రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ మొదటి మ్యాచ్ జరగనుంది.
ఇండియా ఏ : పూనమ్ యాదవ్ (కెప్టెన్), హర్లీన్ డియోల్ (వైస్ కెప్టెన్), ముస్కాన్ మాలిక్, సజ్నా, అమంజోత్ కౌర్, దిశా కసత్, శ్రియాంక పాటిల్, సైకా ఇషాక్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, సహానా పవార్, నుజత్ పర్వీన్ (వికెట్ కీపర్), శివాలి షిండే ( వికెట్ కీపర్), S. అనూష.
ఇండియా బి: దీప్తి శర్మ (కెప్టెన్), షఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), ధార గుజ్జర్, యువశ్రీ, అరుంధతి రెడ్డి, నిషు చౌదరి, హుమేరా కాజీ, దేవికా వైద్య, ఎస్ఎస్ కలాల్, మోనికా పటేల్, SL మీనా, సిమ్రాన్ దిల్ బహదూర్, తానియా సప్నా భాటియా (వికెట్ కీపర్), లక్ష్మి యాదవ్ (వికెట్ కీపర్)
ఇండియా సి: పూజా వస్త్రాకర్ (కెప్టెన్), ఎస్. మేఘన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, సిమ్రాన్ షేక్, టార్నమ్ పఠాన్, కెపి నవ్‌గిరే, అంజలి సింగ్, రాశి కనోజియా, శరణ్య గద్వాల్, కీర్తి జేమ్స్, కోమల్ జంజాద్, అజిమా సంగ్మా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), మమత (వికెట్ కీపర్).
ఇండియా డి: స్నేహ రాణా(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్ (వైస్ కెప్టెన్), అశ్విని కుమారి, డి. హేమలత, కనికా అహుజా, జసియా అక్తర్, యాస్టికా భాటియా, ప్రియాంక ప్రియదర్శిని, శిఖా పాండే, ఎస్‌బి పోఖర్కర్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్‌వాడ్ (వికెట్ కీపర్), సుష్మా వర్మ (వికెట్ కీపర్).
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..