Border-Gavaskar Trophy: టీమ్ ఇండియా బ్యాటింగ్ సలహాదారుడిగా సచిన్ టెండూల్కర్..?

|

Nov 14, 2024 | 10:09 PM

భారత మాజీ క్రికెటర్ WV రామన్, 2025 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) కోసం సచిన్ టెండుల్కర్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించాలని సూచించాడు. టెండుల్కర్ అనుభవం విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులకు కీలకమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని రామన్ అభిప్రాయపడ్డారు. ఆసీస్‌తో సిరీస్ భారత వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) అవకాశం పునరుద్ధరించేందుకు కీలకమని రామన్ అభిప్రాయం.

Border-Gavaskar Trophy: టీమ్ ఇండియా బ్యాటింగ్ సలహాదారుడిగా సచిన్ టెండూల్కర్..?
Sachin Tendulkar
Follow us on

 

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమ్ ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాలని సూచిస్తూ, భారత మాజీ క్రికెటర్ డబ్ల్యువి రామన్ చర్చకు తెరలేపారు. రాబోయే 2025 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) కోసం టెండూల్కర్ అనుభవం భారత బ్యాటింగ్ లైనప్‌కు ఉపయోగపడుతుంది రామన్ అభిప్రాయపడ్డారు. రామన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా ఈ అంశంపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ,  కోసం టెండూల్కర్ సేవలను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పొందడం ద్వారా  ప్రయోజనం పొందవచ్చు” అని రాసుకొచ్చారు.

 

భారత జట్టు ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం సిద్ధమవుతోంది,  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ కి వెళ్లాలంటే ఈ సిరీస్ చాలా కీలకం. ప్రస్తుతం WTC స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారతదేశం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి, కానీ ఇటీవల న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోవడంతో టీమిండియా అవకాశాలు క్లిష్టమయ్యాయి. ఆస్ట్రేలియాపై గెలిస్తే అయితే, మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశముంది. దీంతో WTC ఫైనల్ లో ఆడుతుంది టీమిండిమా.

 

ఈ సిరీస్ భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా కీలకంగా మారనుంది. ఇటీవల కోహ్లి స్పిన్ బౌలింగ్‌పై కష్టాలను ఎదుర్కొన్నారు, ఈ సిరీస్ ద్వారా అతనికి విమర్శకుల నోరుమూయించే అవకాశం ఉండటంతో..టెండూల్కర్ సూచనలు కోహ్లీ బ్యాటింగ్ ను మరింత మెరుగుపరుస్తాయన్నాడు. కోహ్లీతో పాటు జట్టు సభ్యులకు కూడా టెండూల్కర్ అనుభవం ఉపయోగపడుతుందన్నారు.

 

భారత జట్టు పెర్త్‌లోని WACA మైదానంలో ఇప్పటికే శిక్షణ ప్రారంభించింది. టీమిండియా చాలా పకడ్బందీగా ప్రాక్టీస్ సేషన్ నిర్వహిస్తుంది. ఆస్ట్రేలియన్ పరిస్థితుల్లో అనుభవమున్న టెండూల్కర్ కన్సల్టెంట్‌గా చేరితే ఆ అనుభవం జట్టుకు ధైర్యాన్ని చేకూరుస్తుంది, తద్వారా టీమ్ ఇండియా మరింత గట్టి పోటీని ఇచ్చే అవకాశముందన్నారు.